Begin typing your search above and press return to search.

కల్కి 2D Vs కల్కి 3D..!

'కల్కి 2898 AD' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 11 రోజుల రన్ పూర్తి చేసుకుంది

By:  Tupaki Desk   |   8 July 2024 8:07 AM GMT
కల్కి 2D Vs కల్కి 3D..!
X

'కల్కి 2898 AD' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 11 రోజుల రన్ పూర్తి చేసుకుంది. సెకండ్ వీకెండ్ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈరోజు సోమవారం నుంచీ అదే జోరు కొనసాగిస్తే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మూవీ 2డీ వెర్షన్ కు వచ్చిన రెస్పాన్స్ 3డీకి రావడం లేదనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

వైజయంతీ మూవీస్ సంస్థ 'కల్కి 2898 AD' చిత్రాన్ని 2D, 3D, ఐమాక్స్ ఫార్మాట్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేసింది. త్రీడీలో చేస్తున్నామనే విషయాన్ని విడుదలకు ముందు పెద్దగా ప్రమోట్ చెయ్యలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాతే ఈ సంగతి అందరికీ తెలిసింది. ఇది హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన ఫ్యూచరిస్టిక్ మూవీ కావడంతో, 3డీలో చూడ్డానికి అభిమానులు ఆసక్తి కనబరిచారు. కానీ దీనికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది.

నిజానికి ‘కల్కి’ సినిమాలో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా నిలిచాయి. ఇవే ఇప్పుడు జనాలను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఇవే సన్నివేశాలు 3డీ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే, సరికొత్త అనుభూతి కలగాల్సింది. కానీ ‘కల్కి 3D’ విషయంలో అలా జరగడం లేదు. సినిమాలో అక్కడక్కడా మాత్రమే త్రీడీ ఎఫెక్ట్స్ కనిపించాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ మాత్రం దానికి అంత రేటు పెట్టి 3డీలో చూసే బదులు, 2డీలో చూడటం బెటర్ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఆల్రెడీ ‘కల్కి 3D’ చూసిన కొందరు అభిమానులు, ఇప్పుడు మళ్ళీ 2డీలో చూస్తున్నారని తెలుస్తోంది. రెండిటినీ కంపర్ చేస్తూ 2Dలోనే మంచి ఫీలింగ్ వస్తుందని, 3డీలో ఎందుకనో అనుకున్నంత స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ త్రీడీ మేకింగ్ మీద పూర్తిగా దృష్టి పెట్టలేదేమే అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి 'కల్కి 2898 AD' సినిమాని 2డీలో తీసి 3డీ వెర్షన్ లోకి కన్వర్ట్ చేశారు. అందుకే 3D ఎక్స్ పీరియన్స్ సరిగ్గా లేదనే విమర్శలపై ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. "నిజానికి ఈ మధ్య కాలంలో ఎవరూ నేరుగా 3డీలో సినిమా తీయడం లేదు. ఎందుకంటే రెండు కెమెరాలు పెట్టి 3డీలో తీయడమనే స్టీరియోటైపిక్ కాన్సెప్ట్ పోయింది. 90 శాతం సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి.. అలాంటి చిత్రాలకు మనం రెండు కెమెరాలు పెట్టి తీయలేం. సినిమా షూటింగ్ అయిన తర్వాతే 3డీలో చెయ్యగలం" అని నాగి తెలిపారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలో బౌంటీ హంటర్ భైరవగా ప్రభాస్ నటించారు. క్లైమాక్స్ లో కర్ణుడుగా కనిపించి మెస్మరైన్ చేశారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్, అర్జునుడుగా విజయ్ దేవరకొండ కనిపించారు. దీపికా పదుకునే, దిశా పటానీ, శోభన, అన్నా బెన్, కావ్య రామచంద్రన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్ తదితరులు గెస్ట్ రోల్స్ ప్లే చేశారు.