Begin typing your search above and press return to search.

కల్కి 2898AD: టోటల్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందంటే..

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:32 AM GMT
కల్కి 2898AD: టోటల్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందంటే..
X

కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువలైజేషన్ తో కంటెంట్ ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ అయిన థియేటర్స్ పరంగా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల జాబితాలో కల్కి మూడో స్థానంలోకి వచ్చింది. దీనికంటే ముందు రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ని వరల్డ్ వైడ్ గా ఏకంగా 10,200 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. బాహుబలి 2 మూవీ 8500 - 9000 మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

ఇక తాజాగా కల్కి 2898ఏడీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8500 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. దీంతో థియేటర్స్ రిలీజ్ పరంగా టాప్ 3లోకి వచ్చింది. కల్కి తర్వాత అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమాగా ప్రభాస్ సాహో ఉంది. ఈ చిత్రాన్ని 7978 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఐదో, ఆరు, ఏడు స్థానాలలో కూడా ప్రభాస్ సినిమాలే ఉండటం విశేషం. రాధేశ్యామ్ 7010+, ఆదిపురుష్ 7000+, సలార్ పార్ట్ 1 సినిమాని 6200+ థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

ఈ సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ కలెక్షన్ ని కల్కి చాలా ఈజీగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు 200+ కోట్ల గ్రాస్ కల్కి 2898ఏడీ వసూళ్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పబ్లిక్ నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరిగాయి.

ఈ కారణంగానే కలెక్షన్స్ కూడా 200+ కోట్లు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ డే 223 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. దానిని కల్కి అందుకుంటుందా లేదా అనేది చూడాలి. కల్కి మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఇతర స్టార్స్ నుంచి కూడా ఇలాంటి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కల్కి ని దర్శకుడు నాగ్ అశ్విన్ మల్టివర్స్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.