Begin typing your search above and press return to search.

కల్కి.. టైర్-2 హీరోలు ఎలా కనిపిస్తారు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:21 PM GMT
కల్కి.. టైర్-2 హీరోలు ఎలా కనిపిస్తారు?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూవీపై బజ్ పెంచేందుకు రకరకాలుగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. సినిమాలో కీలకమైన బుజ్జి వెహికల్ తో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూవీని ప్రమోట్ చేయిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, పశుపతి, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వీరితోపాటు ఇంకా అనేక మంది ఈ మూవీలో భాగమైనట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, శోభన, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారని టాక్.

ఇప్పుడు ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా యాక్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. నాని కృష్ణుడి రోల్ పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించనున్నారట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే కృష్ణార్జునులు ద్వాపర యుగానికి చెందినవారు. కానీ మహాభారతం నుంచి కలియుగం వరకు ఈ సినిమా సాగుతుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

దీంతో టాలీవుడ్ టైర్-2 హీరోల్లో సమానంగా పోటీ పడుతున్న నాని, విజయ్ చేస్తున్న పాత్రలు కల్కి మూవీలో కీలకమైన రోల్స్ గా ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే సినిమాలో కల్కి, భైరవ పాత్రల్లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు కలిసి నటించిన సీన్స్ ఉన్నాయో లేదో తెలియదు.

ఇప్పటికే నాని, విజయ్ కలిసి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ చేశారు. ఆ సినిమాలో నాని హీరోగా నటించగా.. రిషి రోల్ లో విజయ్ దేవరకొండ యాక్ట్ చేశారు. సినిమా కమర్షియల్ గా మంచి హిట్ కాకపోయినా.. ఇద్దరూ తమ యాక్టింగ్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నాని, విజయ్ మళ్లీ యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను నిర్మించిన స్వప్న సినిమాస్ తోపాటు వైజయంతీ మూవీస్ బ్యానర్లపై మూవీలు చేసిన వాళ్లంతా కల్కిలో కనిపిస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరు ఏ రోల్ లో కనిపిస్తారో జూన్ 27వ తేదీన క్లారిటీగా తెలుస్తుంది.