కల్కి 2898ఏడీ ఓటీటీ ట్విస్ట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 1150+ కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.
By: Tupaki Desk | 12 Aug 2024 4:18 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా 1150+ కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ మూవీగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పట్లో ఏ ఇతర మూవీ కూడా ఈ రికార్డ్ ని అందుకునే ఛాన్స్ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఖాతాలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా కల్కి నిలిచింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి మూవీ రావడం విశేషం.
ఇంతకాలం హాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయిన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ లని ఇండియన్స్ కూడా చేయగలరని నాగ్ అశ్విన్ ప్రూవ్ చేశాడు. ఇదే స్పీడ్ తో మరికొంత మంది దర్శకులు కూడా ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ లతో సినిమాలు, సిరీస్ లు భవిష్యత్తులో చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ మూవీ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతోంది.
ఓటీటీలో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. అయితే ఈ ఓటీటీ వెర్షన్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నారంట. కల్కి థీయాట్రికల్ ప్రింట్ ఏకంగా మూడు గంటల నిడివి ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆరంభంలో కొంత అవసరం లేని సీన్స్ ఉన్నాయనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వచ్చింది. అయితే సినిమాకి ఆదరణ పెరగడంతో చిత్ర యూనిట్ మళ్ళీ మార్పులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఓటీటీ కోసం కొంత ఎడిట్ చేస్తున్నారంట. ఆరంభంలో అవసరం లేని సన్నివేశాలని తొలగించి మూవీని ట్రిమ్ చేస్తున్నారంట.
ఈ ట్రిమ్డ్ వెర్షన్ ని ఓటీటీ ఆడియన్స్ ముందుకి తీసుకొని రాబోతున్నారంట. ఆగష్టు 23న రెంటల్ పద్దతిలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అప్పటికే ట్రిమ్ చేసిన మూవీని అందుబాటులోకి వస్తుందంట. ఫ్రీ స్ట్రీమింగ్ సెప్టెంబర్ నుంచి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా సౌత్ భాషలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. హిందీతో పాటు ఇంటర్నేషనల్ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో కల్కి చిత్రం రిలీజ్ కాబోతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ క్రియేట్ చేసింది. కల్కి సినిమా కూడా డిజిటల్ రిలీజ్ తర్వాత ఇంటర్నేషనల్ లెవల్ లో మూవీ కాన్సెప్ట్ పై చర్చ జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే హాలీవుడ్ మేకర్స్ నుంచి కూడా సినిమాకి ఏమైనా రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.