Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీలో కురుక్షేత్ర సంగ్రామం!

మహాభారతంలో కౌరవులు, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం గురించి భారతీయులు ఎవరూ మరిచిపోరు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 4:43 AM GMT
కల్కి 2898ఏడీలో కురుక్షేత్ర సంగ్రామం!
X

మహాభారతంలో కౌరవులు, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం గురించి భారతీయులు ఎవరూ మరిచిపోరు. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా ఇండియన్ మైథాలజీని బిలీవ్ చేసేవారు కురుక్షేత్రం జరిగిందని బలంగా నమ్ముతారు. దీనిని హిస్టోరియన్స్ అయితే వరల్డ్ వార్ గా అభివర్ణిస్తారు. ఈ కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగింది అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు కూడా ఆర్కియాలజిస్ట్ లు సేకరించారు.


ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని మహాభారత కథని, కురుక్షేత్ర సంగ్రామాన్ని దృశ్యరూపం చేస్తే అద్భుతమైన మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దానికి చాలా మంది దర్శకులు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. అయితే వీటన్నింటి కంటే ముందుగానే కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని నాగ్ అశ్విన్ తన కల్కి 2898ఏడీ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు.


ఈ చిత్రంలో అశ్వద్ధామ పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. అశ్వద్ధామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడారనే విషయం తెలిసిందే. తరువాత శ్రీకృష్ణుడి శాపంతో పాటు వరప్రభావం కారణంగా చిరంజీవిగా ఉన్నారు. ఇప్పటికి అశ్వద్ధామ భూమిపై తిరుగుతున్నట్లుగా నమ్ముతారు. కల్కి 2898ఏడీలో అశ్వద్ధామ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది.


అశ్వద్ధామ క్యారెక్టర్ పరిచయం, ఎలివేషన్ కోసం మూవీలో కురుక్షేత్ర వార్ సీన్స్ ని కూడా నాగ్ అశ్విన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కురుక్షేత్ర సంగ్రామం బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రిలీజ్ ట్రైలర్ గా స్పష్టంగా చూపించారు. ఈ సీక్వెన్స్ కోసం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ ని గెస్ట్ రోల్స్ లో తీసుకొని ఉండొచ్చనే టాక్ నడుస్తోంది.

ఈ కురుక్షేత్ర సంగ్రామం విజువల్స్ కల్కి 2898ఏడీ మూవీకి అదనపు అస్సెట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అశ్వద్ధామ చిరంజీవిగా ఉండటానికి గల కారణాన్ని కల్కి 2898ఏడీలో చూపించబోతున్నట్లు స్పష్టం అవుతోంది. దీపికా పదుకునే గర్భాన జన్మించే కల్కిని కాపాడే బాధ్యతని అశ్వద్ధామ తీసుకున్నట్లు చూపించారు. మరి ఈ కురుక్షేత్ర వార్ సీక్వెన్స్ ని నాగ్ అశ్విన్ ఏ విధంగా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దాదాపు 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898AD సినిమాలో స్టార్ క్యాస్ట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి వాళ్ళు ఉండడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఇక దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది.