Begin typing your search above and press return to search.

కల్కి 2898AD… అందరి ఎదురుచూపులు ఇలానే..

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు

By:  Tupaki Desk   |   19 Jun 2024 8:18 AM GMT
కల్కి 2898AD… అందరి ఎదురుచూపులు ఇలానే..
X

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ వరల్డ్ చిత్రంగా జూన్ 27న థియేటర్స్ లోకి రాబోయే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా సిద్ధమై ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. అలాగే దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి 2898 ఏడీ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. కచ్చితంగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ట్రెండ్ సెట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో నటించిన కీలక యాక్టర్స్ ని చిత్ర యూనిట్ పరిచయం చేస్తోంది. తాజాగా సీనియర్ యాక్టర్ శోభన క్యారెక్టర్ కి సంబందించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ పై ఇంటరెస్టింగ్ లైన్ కూడా రాసుకొచ్చారు. పూర్వీకులలాగే ఆమె కూడా అతని రాక కోసం ఎదురుచూస్తుంది అనే మీనింగ్ వచ్చే కొటేషన్ యాడ్ చేశారు.

దీనిని బట్టి కల్కి రాకకోసం అందరూ ఎదురుచూస్తున్నారనే కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. ఇంకా మూవీ రిలీజ్ కి 8రోజులు మాత్రమే టైం ఉందని హైలైట్ చేశారు. శోభన క్యారెక్టర్ కి మూవీలో చాలా ప్రాధాన్యత ఉంటుందని దీని బట్టి అర్ధమవుతోంది. రాజేంద్రప్రసాద్, శోభన కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కల్కి 2898ఏడీ మూవీ వీరిద్దరూ కనిపించబోతూ ఉండటం విశేషం.

కల్కి బిహైండ్ స్టోరీస్ అంటూ నాగ్ అశ్విన్ ఎపిసోడ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనిలో తనకి కల్కి మూవీ ఐడియా ఎలా వచ్చిందనే విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ఈ కథని తయారు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ వరల్డ్ కి ఆఖరి ఘట్టంగా జరిగే కథ కల్కి అని మూవీపై స్పష్టత ఇవ్వడం విశేషం.