కల్కి.. మిడ్ నైట్ షోస్ లేకపోవడానికి రీజన్ అదేనా?
అయితే కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 25 Jun 2024 12:48 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. రిలీజ్ కు ముందు.. మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేయడంతో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రోజుకు ఐదు షోలు కూడా వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా అలానే పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 5.30 గంటలకు స్పెషల్ వేసుకునేందుకు జీవో జారీ చేసింది. కాగా.. కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ పడతాయని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5.30 గంటలకు ఫస్ట్ షో పడనుంది.
ఇప్పుడు కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ వేయకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అర్థరాత్రి షోస్ వేస్తే ఎక్కువ మంది యువకులే థియేటర్లకు వస్తారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు.. మద్యం సేవించి వచ్చి థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తారని కొందరు చెబుతున్నారు. కాబట్టి మిడ్ నైట్ షోస్ వేయకపోవడం బెటర్ అని అంటున్నారు.
మరోవైపు, కల్కి సినిమా.. భారత పురాణాల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది పెద్ద ప్రయోగం అనే చెప్పాలి. అయితే మిడ్ నైట్ షోస్ వేశాక.. కొందరికి ఏమైనా చిన్న విషయం అర్థం కాకపోయినా సరే.. సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసేస్తారు. దీంతో ఆ పోస్టులు సినీ ప్రియులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి పొద్దున్న ఫ్రెష్ మైండ్ తో సినిమా చూస్తే ఈజీగా క్లారిటీగా అర్థమవుతుందని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం.
అందుకే అర్థరాత్రి షోస్ కాకుండా.. ఉదయం 5.30 గంటలకు షోస్ వేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ బాహుబలి మూవీకి కూడా అర్థరాత్రి నెగెటివ్ రివ్యూలు వచ్చిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు టాక్. అలా మరోసారి జరగకుండా చూడాలని ఇలా చేసినట్లు సమాచారం. అయితే రివ్యూలతో సంబంధం లేకుండా... పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు.. కల్కి సినిమా దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.