Begin typing your search above and press return to search.

కల్కిలో.. మరో ఇద్దరా?

హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల అంచనాలను తగ్గట్లు మేకర్స్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 1:48 PM GMT
కల్కిలో.. మరో ఇద్దరా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచాన్ని చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల అంచనాలను తగ్గట్లు మేకర్స్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఇప్పటికే కల్కి 2898 ఏడీ మూవీలో ఎందరో స్టార్ నటీనటులు భాగమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే కల్కిలో స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ మృణాల్ ఠాకూర్ తో పాటు శోభన కూడా క్యామియో రోల్స్ లో సందడి చేయనున్నట్లు సమాచారం. మృణాల్ తన ఇన్స్ టాగ్రామ్ స్టోరీలో కల్కి మూవీని ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె కూడా కల్కిలో నటిస్తున్నట్లు ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

అయితే కల్కి నిర్మాతలు రూపొందించిన సీతారామం మూవీతోనే టాలీవుడ్ కు పరిచయమైంది ఈ బ్యూటీ. అంతే కాదు.. మెల్ బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి మూవీ ప్రీమియర్ వేసిన సమయంలో మృణాల్ ఠాకూర్ ను నాగ్ అశ్విన్ తొలిసారి గుర్తించారు. ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కు కూడా కల్కి బ్యానర్ వైజయంతీ మూవీస్ తో మంచి రిలేషన్ ఉంది.

మహానటిలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ నటించారు. ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా విజయ్ యాక్ట్ చేశారు. అయితే కల్కి మూవీలో శోభన నటించడం కన్ఫర్మ్ అయితే.. 18 ఏళ్ల బ్రేక్ తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించినట్లు అవుతుంది. 2006లో చివరిగా శోభన కనిపించింది. మొత్తానికి కల్కి మూవీ కోసం నాగ్ అశ్విన్.. పెద్ద ఎత్తున నటీనటులను దించినట్లు టాక్. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.