కనిపించని ఆ విలన్ ఎవరు కల్కీ?
కమల్ ఇమేజ్ తోడైతే వరల్డ్ వైడ్ మార్కెట్ కి అంతకంతకు దోహదం చేస్తుందని కమల్ కోట్ చేసినంత ఎలాంటి బేరాలు లేకుండా ఇచ్చినట్లు లీకులందాయి
By: Tupaki Desk | 26 March 2024 11:30 PM GMT'కల్కీ 2898'లో మెయిన్ విలన్ ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ఇప్పటివరకూ ఆబాధ్యతలు విశ్వనటుడు కమల్ హాసన్ తీసుకున్నట్లు అంతా భావించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కొట్టడానికి అతనొక్కడే సరితూగుతాడని అందుకే కమల్ ని భారీ తోషికం ఇచ్చిమరీ ఒప్పించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కమల్ ఇమేజ్ తోడైతే వరల్డ్ వైడ్ మార్కెట్ కి అంతకంతకు దోహదం చేస్తుందని కమల్ కోట్ చేసినంత ఎలాంటి బేరాలు లేకుండా ఇచ్చినట్లు లీకులందాయి.
కానీ తాజాగా' కల్కి'లో కమల్ కేవలం గెస్ట్ రోల్ మాత్రమే పోషించనట్లు నేషనల్ మీడియాతో తెలిపాడు. మెయిన్ విలన్ పాత్ర తాను పోషించలేదని క్లారిటీ ఇచ్చేసారు. దీంతో సినిమాలో అసలు విలన్ ఎవరో? అంటూ కొత్త చర్చ మొదలైంది. చివరికి షూటింగ్ క్లైమాక్స్ చేరింది..రిలీజ్ తేది దగ్గర పడుతోంది. అయినా ఇంతవరకూ అలసు విలన్ ఎవరు? అన్నది యూనిట్ రివీల్ చేయకపోవడం అంతే ఆసక్తికరంగా మారుతోంది.
కమల్ ని పక్కనబెట్టి చూస్తే సినిమాలో ఇంకెవరెవరు నటిస్తున్నారు? అంటే బాలీవుడ్ లెజెండ్ బిగ్ బీ అమితాచ్చన్ కూడా నటిస్తున్నారు. ఆయనది కూడా కీలక పాత్ర మాత్రమే అని తెలిసింది. విలన్ గా అమితాబచ్చన్ నటిస్తాడా? అంటే అందుకు ఛాన్స్ లేదు. ఆ తర్వాత ఆప్షన్ లో ఎవరు ఉన్నారు అంటే తమిళ నటుడు పసుపతి కనిపిస్తున్నాడు. విలన్ పాత్రకు అన్నిరకాలుగా సరితూగిన వాడు. గతంలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నూ నటించాడు. విలన్ గా గెటప్ కి సూటయ్యే వంద శాతం నటుడు కూడా.
ఈ నేపథ్యంలో పసుపతికి ఆ ఛాన్స్ ఇచ్చారా? అన్నది చూడాలి. అలాగే బెంగాలీ నటుడు సాస్టట్ ఛటర్జీ నటిస్తున్నాడు. బెంగాలీలో ఎన్నో సినిమాలు చేసాడు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసాడు. తెలుగు లో కల్కీ మొదటి చిత్రం. దర్శకుడు నాగ్ అశ్విన్ పనిగట్టుకున మరీ అతడిని టాలీవుడ్ లో ఈ సినిమాతోనే లాంచ్ చేస్తున్నాడు. మరి ఆ చిదంబర రహస్యం ఏంటి? అన్నది తెలియాలి. అలాగే రానా కూడా నటిస్తున్నాడు. అతడి రోల్ పై స్పష్టత లేదు. మరి సైలెంట్ గా అతడినే విలన్ గా దించేస్తున్నాడా? అన్నది చూడాలి.