Begin typing your search above and press return to search.

అక్కడ నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్

ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా బాహుబలి 2 నార్త్ అమెరికా కలెక్షన్స్ ని అందుకోలేదు.

By:  Tupaki Desk   |   13 July 2024 9:31 AM GMT
అక్కడ నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్
X

ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్ లో మన సినిమాలని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నార్త్ అమెరికా లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా బాహుబలి 2 మూవీ నిలిచింది. ఈ సినిమా 20.77 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా బాహుబలి 2 నార్త్ అమెరికా కలెక్షన్స్ ని అందుకోలేదు.

పఠాన్, జవాన్ సినిమాలకి బాహుబలి 2 దగ్గరకి వచ్చాయి కానీ బీట్ చేయలేకపోయాయి. ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ అందుకుంది. సౌత్ నుంచి బాహుబలి తర్వాత వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటిన సినిమాగా కల్కి మూవీ నిలిచింది. లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు చేస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

డార్లింగ్ ప్రభాస్ మాస్ ఇమేజ్, అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, దీపికా పదుకునే చరిష్మా ఈ సినిమా సక్సెస్ లో కీలకంగా మారాయి. అలాగే నాగ్ అశ్విన్ క్రియేటివ్ విజన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ సూపర్ హీరో మూవీగా కల్కి 2898ఏడీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ప్రపంచాన్ని చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగింది. భారీ లాభాల బాటలో మూవీ కొనసాగుతోంది.

ఇక నార్త్ అమెరికా మార్కెట్ లో కల్కి 2898ఏడీ మూవీ 17 మిలియన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్స్ ని నార్త్ అమెరికా లో అందుకున్న రెండో సినిమాగా కల్కి 2898ఏడీ నిలిచింది. ఆర్ఆర్ఆర్, సలార్ కలెక్షన్స్ రికార్డ్స్ ని నార్త్ అమెరికా మార్కెట్ కల్కి బ్రేక్ చేసింది. దీనిని బట్టి నార్త్ అమెరికాలో కల్కి చిత్రానికి అపూర్వ ఆదరణ లభిస్తోందని అర్ధమవుతోంది. లాంగ్ రన్ లో 18+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి నార్త్ అమెరికాలో అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. కల్కి 2898ఏడీ పార్ట్ మూవీ బాహుబలి 2 రికార్డులని నార్త్ అమెరికాలో కచ్చితంగా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

నాగ్ అశ్విన్ పార్ట్ 2కి సంబందించిన స్క్రిప్ట్ పై రీవర్క్ చేస్తున్నారు. కొన్ని సీన్స్ పరంగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే క్యారెక్టరైజేషన్స్ విషయంలో వచ్చిన విమర్శలని పరిగణంలోకి తీసుకొని అందరికి ఆమోదయోగ్యమయ్యే విధంగా పార్ట్ 2ని తెరకెక్కించాలని అనుకుంటున్నారు. దీపికా పదుకునే కూడా మరో ఆరు నెలల పాటు షూటింగ్ కి అందుబాటులో ఉండకపోవచ్చు. అన్ని సెట్ అయిన తర్వాత కల్కి పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అర్ధమవుతోంది.