Begin typing your search above and press return to search.

RRR రికార్డ్ బ్లాస్ట్ చేసిన ప్రభాస్

ఈ సినిమాలో అశ్వద్ధామ క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ తప్ప ఇంకెవరు సెట్ కారని మూవీ చూస్తున్నంత సేపు అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   22 July 2024 1:12 PM GMT
RRR రికార్డ్ బ్లాస్ట్ చేసిన ప్రభాస్
X

కల్కి 2898ఏడీ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రజలు సినిమాని ఎన్ని సార్లు అయిన చూస్తారని కల్కి మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన కథని సిద్ధం చేసుకొని అందులో అంతే స్థాయిలో దేశవ్యాప్తంగా ఫేమ్ ఉన్న క్యాస్టింగ్ ని ఎంపిక చేసుకొని కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమాలో అశ్వద్ధామ క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ తప్ప ఇంకెవరు సెట్ కారని మూవీ చూస్తున్నంత సేపు అనిపిస్తుంది.

అలాగే సుప్రీమ్ యాస్కిన్ రోల్ లో కూడా కమల్ హాసన్ బెస్ట్ ఛాయస్ అని అందరూ చెప్పే మాట. భైరవ క్యారెక్టర్ లో డార్లింగ్ ప్రభాస్ ఓ వైపు యాక్షన్ మరో వైపు ఫన్ జెనరేట్ చేసి ప్రేక్షకులని అద్భుతంగా ఎంగేజ్ చేశాడు. క్యారెక్టర్ ఏదైనా దాని డెప్త్ అండ్ ఎమోషన్ ని అర్ధం చేసుకొని తెరపై చూపించడంలో తాను బెస్ట్ అని డార్లింగ్ ప్రభాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ పాపులర్ యాక్టర్ గా యంగ్ రెబల్ స్టార్ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది.

లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా 1100-1200 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియన్ మార్కెట్ లో కూడా కల్కి చిత్రానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. 25 రోజుల్లోనే ఈ సినిమా నార్త్ ఇండియాలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా నార్త్ లో ఓవరాల్ గా 272.78 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కల్కి మూవీ ఇప్పటి వరకు హిందీలో 275.90 కోట్ల వసూళ్లని సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

సౌత్ ఇండియా నుంచి వచ్చి హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో కల్కి మూవీ మూడో స్థానంలో ఉంది. బాహుబలి 2 మూవీ 511 కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా 435 కోట్ల కలెక్షన్స్ తో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికి హిందీలో డీసెంట్ వసూళ్లని కల్కి సాధిస్తోంది. అలాగే నార్త్ అమెరికాలో కూడా ఇప్పటికే మూవీ 18 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 20 మిలియన్స్ కి దగ్గర అవుతోంది.

ఈ ఏడాదిలో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి అత్యధిక కలెక్షన్స్ ని అందుకున్న చిత్రంగా కల్కి 2898ఏడీ మూవీ నిలిచింది. భారతీయ ఇతిహాసాలని వక్రీకరించకుండా. ప్రజామోదం లభించే ఫిక్షనల్ ఎలిమెంట్స్ ని జోడించి కథని చెబితే అద్భుతంగా ఆదరిస్తారని కల్కి ప్రూవ్ చేసింది. కల్కి సినిమాని పురాణాల ఆధారంగా చేసుకొని చెప్పిన కూడా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా చేయడం కూడా ప్లస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది.