కల్కి ట్రైలర్.. ముందున్న టార్గెట్స్ ఇవే..
లైక్స్ పరంగా టాలీవుడ్ లో సెకండ్ ప్లేస్ లో 1.23 మిలియన్ వ్యూస్ తో సలార్ చిత్రమే ఉంది. ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం కల్కి 2898ఏడీ మూవీ కచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యిందని ఒప్పుకోవచ్చు.
By: Tupaki Desk | 7 Jun 2024 4:45 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898ఏడీ. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా కల్కి చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే కల్కి నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాకి హైప్ తీసుకొచ్చాయి.
ఈ సినిమా ద్వారా భారీ కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ట్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ రాబోతోంది. ఈ కారణంగా మూవీపైన నెక్స్ట్ లెవల్ హైప్ ఉంది. నాగ్ అశ్విన్ టేకింగ్, కంటెంట్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీ పబ్లిక్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ జూన్ 10న రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
డైరెక్ట్ గా థియేటర్స్ లోనే ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఈ ట్రైలర్ కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. కల్కి 2898ఏడీ ట్రైలర్ ముందు చాలా రికార్డ్స్ బ్రేక్ కావడానికి రెడీగా ఉన్నాయి. వీటిలో ముందుగా చూసుకుంటే టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ సాధించే ట్రైలర్ గా ప్రభాస్ సలార్ మూవీ ఉంది. మూడు నిముషాల్లో లక్ష లైక్స్ ని ఈ ట్రైలర్ అందుకుంది. తరువాత పవర్ స్టార్ భీమ్లా నాయక్ 4 నిమిషాల్లో లక్ష లైక్స్ అందుకుంది. దీనిని కల్కి బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.
24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టాలీవుడ్ మూవీ ట్రైలర్ గా గుంటూరు కారం నిలిచింది. ఈ ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో ప్రభాస్ సలార్ 32.58 మిలియన్ వ్యూస్ తో ఉంది. సౌత్ రికార్డ్స్ పరంగా చూసుకున్న ఈ సినిమా ట్రైలర్స్ టాప్ లో ఉన్నాయి. వీటిని కల్కి2898ఏడీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అలా లైక్స్ పరంగా చూసుకుంటే టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రానికి 1.24 మిలియన్ లైక్స్ వచ్చాయి. సౌత్ పరంగా చూసుకుంటే లియో మూవీ టాప్ లో ఉంది. ఈ సినిమాకి 2.64 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ రెండు రికార్డ్స్ లో కల్కి దేనిని బ్రేక్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లైక్స్ పరంగా టాలీవుడ్ లో సెకండ్ ప్లేస్ లో 1.23 మిలియన్ వ్యూస్ తో సలార్ చిత్రమే ఉంది. ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం కల్కి 2898ఏడీ మూవీ కచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యిందని ఒప్పుకోవచ్చు.