Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ.. ఆ చిన్న సినిమా భలే తట్టుకుందే..

కల్కి రిలీజ్ తర్వాత ముంజ్య మూవీ ఆడుతున్న థియేటర్స్ సంఖ్య తగ్గిపోయింది. దీంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదని అందరూ భావించారు.

By:  Tupaki Desk   |   3 July 2024 3:59 AM GMT
కల్కి 2898ఏడీ.. ఆ చిన్న సినిమా భలే తట్టుకుందే..
X

బాలీవుడ్ లో పెద్ద సినిమాలు కమర్షియల్ గా డిజాస్టర్ అవుతున్న కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటాయి. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో దర్శకులు ప్రేక్షకుల మెప్పిస్తూ వినోదం అందిస్తారు. కొన్ని చిన్న సినిమాలు లో బడ్జెట్ తో వచ్చిన అద్భుతమైన కలెక్షన్స్ ని అందుకుంటూ ఉంటాయి. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో బాగా వినిపించిన రెండు చిన్న సినిమాలలో మొదటిది 'లపట్టా లేడీస్' మేగ్జిమమ్ కొత్త ఆర్టిస్ట్స్ తో లో బడ్జెట్ తో కిరణ్ రావ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు.

దీని తర్వాత గట్టిగా వినిపించిన పేరు ముంజ్య. లోబడ్జెట్ లో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఆదిత్య వర్మ, సర్వారి లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీజీలో ఓ డిఫరెంట్ క్రియేచర్ ని క్రియేట్ చేసి దాంతో హర్రర్, కామెడీ పండించారు. ఆ క్యారెక్టర్ మూవీలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూనే ట్రావెల్ అవుతుంది. తమిళ్ యాక్టర్ సత్యరాజ్ ఓ కీలక పాత్రని ముంజ్య మూవీలో చేశారు.

ఇదిలా ఉంటే జూన్ 7న ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చి మెల్లగా మౌత్ టాక్ తో పికప్ అయ్యింది. నిలకడగా కలెక్షన్స్ రాబడుతూ 100+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది. నిజానికి కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ తర్వాత ముంజ్యకి ఆదరణ తగ్గుతుందని అందరూ అనుకున్నారు. అప్పటికే మూడు వారాల నుంచి సినిమా థియేటర్స్ లో నడుస్తోంది. 93 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

కల్కి రిలీజ్ తర్వాత ముంజ్య మూవీ ఆడుతున్న థియేటర్స్ సంఖ్య తగ్గిపోయింది. దీంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదని అందరూ భావించారు. అయితే కల్కి ప్రభావం ఉన్న కూడా ఊహించని విధంగా ఈ మూవీ స్థిరమైన కలెక్షన్స్ సాధిస్తూ 100 కోట్ల మార్క్ ని దాటేసింది. కల్కి మానియాలో కూడా ఈ సినిమా నిలబడి సెంచరీ కొట్టడం నిజంగా విశేషమని చెప్పాలి.

ఈ మూవీలో చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరూ లేరు. మేగ్జిమమ్ కొత్త ఫేస్ లు కనిపిస్తాయి. అలాగే చిన్న ఆర్టిస్ట్స్ నటించారు. అయిన ప్రేక్షకులకి కంటెంట్ కనెక్ట్ కావడంతో బ్లాక్ బస్టర్ చేశారు. దీనిని బట్టి బాలీవుడ్ లో గ్రాండ్ నెస్ కంటే కంటెంట్ కి ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని స్టార్స్, మేకర్స్ అర్ధం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.