Begin typing your search above and press return to search.

కల్కికి కాపీ సెగ.. మేకర్స్ ఏం చెబుతారో?

కల్కి మేకర్స్ పర్మిషన్ లేకుండా.. తన ఆర్ట్ వర్క్ వాడారని దక్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 1:48 PM GMT
కల్కికి కాపీ సెగ.. మేకర్స్ ఏం చెబుతారో?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో ప్రముఖులు భాగమయ్యారు.

జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న కల్కి మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూశాక అందరూ వావ్ అన్నారు. నాగ్ అశ్విన్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ తెల్సిందని నెటిజన్లు తెలిపారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంటుందని అర్ధమైనట్లు కామెంట్స్ పెట్టారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వెపన్స్.. అలా అన్ని విషయాల్లో సూపర్ అంటూ కొనియాడారు

అయితే ఇప్పుడు ఈ సినిమాకు కాపీ సెగ తగిలింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్ సినిమాలను నాగ్ అశ్విన్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని చాలా మంది అన్నారు. ఇప్పుడు ట్రైలర్ లో ఇంట్రో సీన్ ను కాపీ చేశారని ఓ హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆరోపించారు. కల్కి మేకర్స్ పర్మిషన్ లేకుండా.. తన ఆర్ట్ వర్క్ వాడారని దక్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

కల్కి ట్రైల‌ర్ మొద‌ల‌వ్వ‌గానే ఒక శాటిలైట్ కింద ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. అందుకోసం 10 ఏళ్ల క్రితం.. తాను డిజైన్ చేసిన శాటిలైట్ ఆర్ట్ ను కల్కి మేకర్స్ యూజ్ చేసినట్లు సంగ్ చోయ్ ఆరోపించారు. తన ఆర్ట్ తో కల్కి ట్రైలర్ లో స్క్రీన్ షాట్ ను కంపేర్ చేసి కూడా పోస్ట్ చేశారు సంగ్ చోయ్. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. సంగ్ చోయ్ చేసిన ఇన్స్ స్టాగ్రామ్ పోస్ట్ పై కల్కి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు ఈ సీన్ కాకుండా.. మరికొన్ని సీన్స్ కూడా కాపీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ చిన్న చిన్న సిమిలారిటీస్‌ పట్టుకుని కాపీ అనడం కరెక్ట్ కాదని ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇండియన్ మైథాలజీలోని కాన్సెప్ట్ ను తీసుకుని ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో కల్కి ప్రపంచాన్ని సృష్టించారు నాగ్ అశ్విన్. మరి సినిమా రిలీజ్ అయ్యాక అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.