Begin typing your search above and press return to search.

అశ్విన్‌ భయ్యా.. కల్కి 2 ఎక్కడ?

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

By:  Tupaki Desk   |   20 Jun 2024 7:05 AM GMT
అశ్విన్‌ భయ్యా.. కల్కి 2 ఎక్కడ?
X

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా పాన్ వరల్డ్‌ మూవీ అంటూ ప్రచారం చేస్తూ వస్తున్న మేకర్స్‌ అన్నట్లుగానే ఆ స్థాయి సినిమాను రూపొందించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమాను ఏకంగా రూ.600 కోట్ల తో నిర్మించారు. ఆ స్థాయిలో ఖర్చు చేయడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు మంచి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. పైగా ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌ ఓ హాలీవుడ్‌ మూవీ రేంజ్ లో ఉందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

కల్కి సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో, భారీ ఓపెనింగ్స్ రావాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ వ్యూహంలో భాగంగా రెండు ట్రైలర్‌ లను తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఒక ట్రైలర్‌ విడుదల అయ్యింది. రెండో ట్రైలర్‌ ఆ మధ్య సోషల్‌ మీడియా ద్వారా లీక్ అయ్యింది.

అప్పుడు లీక్‌ అయిన ట్రైలర్‌ ను ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అఫిషియల్‌ గా చూడాలని కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ముఖ్యంగా ఎక్స్ ద్వారా నాగ్‌ అశ్విన్‌ కు ట్రైలర్ 2 రిక్వెస్ట్‌ లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎప్పుడు ట్రైలర్‌ 2 అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకునే మరియు దిశా పటానీ లు హీరోయిన్స్ గా నటించారు. యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ లతో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.