Begin typing your search above and press return to search.

ప్రభాస్ బిజినెస్.. అక్కడ నెవ్వర్ బిఫోర్ డీల్!

ఇక తెలుగు రాష్ట్రాలలో నైజాం, ఆంధ్రా, సీడెడ్ లో కల్కి 2898ఏడీ మీద భారీ బిజినెస్ జరిగిందంట. సీడెడ్ లో మునుపెన్నడూ ఏ సినిమాకి జరగని స్థాయిలో బిజినెస్ జరిగింది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 4:53 AM GMT
ప్రభాస్ బిజినెస్.. అక్కడ నెవ్వర్ బిఫోర్ డీల్!
X

టాలీవుడ్ లో స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలకి మార్కెట్ లెక్కలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. సినిమా ఎంత ఎక్కువ ధరకి ఏరియా వారీగా అమ్ముడైతే అంత ఎక్కువ బ్రాండ్ వేల్యూ ఉన్నట్లు లెక్క. తెలుగులో టైర్ 1 హీరోలు అందరికి తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ ఒకే తరహాలో ఉంటుంది. అయితే అందరికంటే ఎక్కువ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపైన బిజినెస్ జరుగుతుంది.

దీనికి కారణం హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా దేశంలోనే అత్యధిక బడ్జెట్ సినిమాలు ప్రభాస్ తో నిర్మాతలు చేస్తున్నారు. అలాగే రిలీజ్ కి ముందు ఆ సినిమాలపైనే కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మేకర్స్ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటికి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే డిస్టిబ్యూటర్స్ ఎక్కువ మొత్తంలో ఏరియా వారీగా రైట్స్ కొనడానికి ముందుకొస్తారు.

ఈ ఏడాది టాలీవుడ్ లో వస్తోన్న అతి పెద్ద సినిమా అంటే కల్కి 2898ఏడీ అని చెప్పొచ్చు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని 600+ కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించింది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా 22 భాషలలో థియేటర్స్ లోకి కల్కి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ ని భారీ ధరకి నిర్మాతలు అమ్మేశారు. కొన్ని ప్రాంతాలలో అడ్వాన్స్ బేస్డ్ గా మాట్లాడుకొని డిస్టిబ్యూటర్స్ తో ఒప్పందం చేసుకున్నారు. అంటే సొంతంగానే రిలీజ్ చేస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలలో నైజాం, ఆంధ్రా, సీడెడ్ లో కల్కి 2898ఏడీ మీద భారీ బిజినెస్ జరిగిందంట. సీడెడ్ లో మునుపెన్నడూ ఏ సినిమాకి జరగని స్థాయిలో బిజినెస్ జరిగింది. ఏకంగా 27 కోట్లకి కల్కి 2898ఏడీ సీడెడ్ రైట్స్ అమ్ముడయ్యాయి. ప్రభాస్ సలార్ మూవీకి కూడా సీడెడ్ లో 27 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ మాత్రం తెచ్చుకుంది. పెద్దగా లాభాలు రాలేదు.

కల్కి 2898ఏడీ మూవీపై ఆరంభంలో పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాపై విపరీతంగా బజ్ క్రియేట్ అయ్యింది. ఇక మూవీ ట్రైలర్ అయితే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ తారాస్థాయికి పెంచేసింది. దీంతో సీడెడ్ లో బిజినెస్ వేల్యూ పెరిగిందనే మాట వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ పై అశ్వినిదత్ నిర్మించారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.