Begin typing your search above and press return to search.

కల్కి నైజాం లెక్క… ఇది బిగ్ డామినేషన్!

కచ్చితంగా కల్కి 2898ఏడీ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 3:40 AM GMT
కల్కి నైజాం లెక్క… ఇది బిగ్ డామినేషన్!
X

కల్కి 2898ఏడీ మూవీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ గా ఉంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మహానటి తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకు వస్తున్నాడు. మూడేళ్లుగా ఇదే ప్రాజెక్ట్ పై దర్శకుడు వర్క్ చేస్తున్నాడు. అంతకుముందే ఈ కథని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాడు. కచ్చితంగా కల్కి 2898ఏడీ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో కల్కి చిత్రం వస్తోంది. ఈ చిత్రంతో ఇండియన్ సినిమాకి హాలీవుడ్ లో గేట్స్ ఓపెన్ అవుతాయని భావిస్తున్నారు. ఈ మూవీ బిజినెస్ అన్ని ఏరియాలలో క్లోజ్ అయ్యింది. చాలా చోట్ల అడ్వాన్స్ బేస్డ్ గా మాట్లాడుకొని వైజయంతీ మూవీస్ డైరెక్ట్ గా రిలీజ్ చేస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో కూడా కల్కి 2898ఏడీ సినిమాపై పబ్లిక్, ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే జెట్ స్పీడ్ తో హౌస్ ఫుల్ పడతాయని అంచనా వేస్తున్నారు. మొదటి రోజు కల్కి 2898 ఏడీ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనే దానిపై ఎవరికి వారు తమ లెక్కలు వేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కల్కి మూవీ టికెట్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు మెజారిటీ కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నైజాంలో కల్కి సినిమాని ఏకంగా 400 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారంట. అంటే 95% థియేటర్స్ ని కల్కి మూవీనే ఆక్యుపై చేయనుంది. ఆ రోజు మరి ఏ ఇతర సినిమాలు లేవు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అన్ని చోట్ల నుంచి ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కచ్చితంగా కల్కి 2898 ఏడీ మూవీ నైజాంలో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ని కల్కితో మొదటి రోజు రాబట్టాలని భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఓ పెద్ద సినిమా కోసం ఆరు నెలలుగా వెయిట్ చేస్తున్నారు. ఆకలితో ఉన్న ఆడియన్స్ కి కల్కి 2898ఏడీ ఫుల్ మీల్స్ ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.