కల్కి 2898 AD థీమ్‌లో చంద్రబోస్ కలం బలం
2024 మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' ఈ గురువారం థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 25 Jun 2024 4:53 PM GMT2024 మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' ఈ గురువారం థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ ట్రైలర్ పాటలు ఇలా అన్ని విభాగాల్లో బలమైన ప్రభావం చూపించడంలో టీమ్ పెద్ద సక్సెసైంది.
విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రేక్షకులు, సినీవర్గాల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టికెట్ బుకింగ్ సైట్లు క్రాస్ అయ్యేంతగా కల్కి థియేటర్లపై ఒత్తిడి ఉందని ట్రేడ్ చెబుతోంది. ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఈ చిత్రం నుండి 'థీమ్ ఆఫ్ కల్కి'ని విడుదల చేసారు. ఇది లార్డ్ శ్రీకృష్ణునిపై పాట. మనోహరమైన దైవికమైన ఈ పాటను కాల భైరవ పాడారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సంతోష్ సంగీతానికి అనుగుణంగా బోస్ సాహిత్యం ప్రేక్షకుల హృదయాలపై ఘాడమైన ముద్ర వేస్తోందనడంలో సందేహం లేదు. వార్ నేపథ్యంలో విజువల్స్... భైరవ.. అశ్వత్థామ పాత్రలు.. దీపిక దూత పాత్ర ఇవన్నీ ఎంతో ఉత్కంఠను పెంచుతుండగా.. పాత్రలను అనుసంధానిస్తూ.. లిరిక్ లో లార్డ్ కృష్ణను స్థుతిస్తూ.. చంద్రబోస్ రాసిన పదాలు ఎంతో సున్నితంగా హృదయాలను తాకుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ 'నాటునాటు..'కు భిన్నమైన శైలిలో సాగే ఈ పాటకు చంద్రబోస్ లిరికల్ మాయాజాలం ప్రధాన అస్సెట్ అనడంలో సందేహం లేదు. సినిమా ఇతివృత్తాన్ని సారాన్ని సంపూర్ణంగా ఒడిసి పట్టుకుని లిరిక్ ని అందించడం ప్రశంసనీయం. అద్భుత సాహితీ విలువలు.. చక్కని బాణి.. గానాలాపనతో 'థీమ్ ఆఫ్ కల్కి' పాన్ ఇండియన్ అప్పీల్ ని మరింతగా పెంచిందనడంలో సందేహం లేదు.
అధర్మాన్ని అణిచేయగా, యుగయుగాల జగములోన పరిపరివిధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే.. స్వధర్మాన్ని పరిరక్షించగ.. సమస్తాన్ని ప్రక్షాళించగా.. సముద్భవించే అవతారమిదే.. మీనమై.. కూర్మమై .. వరాహమై.. మనకు సాయమై..... ఇలా ప్రతి పదంలో చంద్రబోస్ మ్యాజిక్ కనిపించింది. పాట అర్థాన్ని డెప్త్ ని పెంచడంలో ఈ పదజాలం సహకరించిందనడంలో సందేహం లేదు.
శ్రీకృష్ణుని జన్మస్థలంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్న పవిత్ర భూమి మధురలో ఈ పాట ప్రారంభించారు. ఆలయ మెట్లపై వంద మంది నర్తకులు మధురమైన పాటను ప్రదర్శించి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌ను సృష్టించడం ఒక సంపూర్ణ అద్భుత దృశ్యం. ఈ చిత్రంలో మరియమ్ పాత్రలో నటి శోభనా చంద్రకుమార్ సహా డాన్సర్‌లు చేరారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 AD'లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం 27 జూన్ 2024న థియేటర్లలో విడుదల కానుంది.