Begin typing your search above and press return to search.

కల్కి టికెట్ రేట్ల పెంపు.. తెలంగాణలో ఎంతంటే?

ఈ నేపథ్యంలో తెలంగాణలో కల్కి సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జీవో కూడా జారీ చేసింది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:04 AM GMT
కల్కి టికెట్ రేట్ల పెంపు.. తెలంగాణలో ఎంతంటే?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సినీ ప్రియులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్.. సిల్వర్ స్క్రీన్ పై నాగి క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచాన్ని చూసేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పుడు బొమ్మ పడుతుందా? అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

అమెరికాలో ఇప్పటికే కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మిలియన్లు దాటిన విషయం తెలిసిందే. అతి త‌క్కువ టైమ్‌ లో ఈ ఘ‌న‌త‌ సాధించిన ఇండియ‌న్ మూవీగా క‌ల్కి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కల్కి సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జీవో కూడా జారీ చేసింది.

జూన్ 27వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు కల్కి మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌ లో రూ.75, మ‌ల్టీప్లెక్స్‌ లో రూ.100 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును కల్పించింది. గరిష్ఠంగా టికెట్ పై రూ.200 పెంచుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతోపాటు రిలీజ్ రోజు ఉదయం 5.30 గంటలకు స్పెషల్ షో వేసేందుకు అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కల్కి మూవీకి సింగిల్ స్క్రీన్ లో రూ.265, మల్టీప్లెక్స్ లో రూ.413 వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్కి టికెట్‌ ధరలపై సోమవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సింగిల్‌ స్క్రీన్స్‌ తో పాటు మ‌ల్టీప్లెక్స్‌ లో వంద రూపాయ‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీవో రాగానే రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కానున్నట్లు టాక్.

ఇక సినిమా విషయానికొస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో కల్కిని రూపొందించారు. ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున, వినూత్నంగా చేస్తున్నారు. మూవీలో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, మాళ‌విక నాయ‌ర్‌, అన్నాబెన్‌ తదితరులు నటిస్తున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.