పర్స్ ఖాళీ అవ్వకుండా 'కల్కి 2898 AD' చూడటమెలా?
నేటి నుండి 'కల్కి 2898 AD' టిక్కెట్లు కేవలం రూ. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో రూ.100కే (పన్నులు మినహాయించి) అందుబాటులోకి వచ్చింది.
By: Tupaki Desk | 2 Aug 2024 5:06 AM GMTకల్కి 2898 AD చిత్రం 27 జూన్ 2024న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మక వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమెరికా లాంటి చోట్ల నెవ్వర్ బిఫోర్ కలెక్షన్లతో ఔరా! అనిపించింది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి సమీక్షలను సంపాదించిన ఈ చిత్రం సీక్వెల్ గురించి ఆసక్తిగా వేచి చూసేలా చేసింది. కల్కి ఇప్పటి వరకు 1100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.
ఈ చిత్రం థియేటర్లలో ఆరవ వారంలోకి ప్రవేశించడంతో మేకర్స్ 'పాకెట్ పర్స్ ఫ్రెండ్లీ టికెట్' ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. నేటి నుండి 'కల్కి 2898 AD' టిక్కెట్లు కేవలం రూ. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో రూ.100కే (పన్నులు మినహాయించి) అందుబాటులోకి వచ్చింది. వారం పాటు ఇదే టికెట్ రేటు కొనసాగనుంది. ఈ నిర్ణయం థియేటర్లకు ప్రజల్ని మరింతగా రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సైన్స్-ఫిక్షన్ సినిమా దృశ్యాలను తిరిగి థియేటర్లలోనే ఆస్వాధించేందుకు సినీప్రియుటకు ఇది సదవకాశం.
టికెట్ ధర అందుబాటులో ఉంటే కుటుంబాలు కలిసి సినిమాను ఆస్వాధించడానికి సరైన అవకాశం దక్కినట్టు. ఈ ప్రత్యేక ధర ఆగస్టు 9 వరకు అందుబాటులో ఉంటుంది. కల్కి చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు నటించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే పాత్రలు, కమల్ హాసన్ పాత్ర సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.