Begin typing your search above and press return to search.

కల్కి ట్రైలర్...అంత బజ్ లేదా?

కల్కి 2898 ఏడీ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు సినిమా జానర్ మరియు కథలో ఏముండబోతోందో క్లియర్ గా తెలియజేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:03 AM GMT
కల్కి ట్రైలర్...అంత బజ్ లేదా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ, ట్రైలర్ విడుదల తర్వాత మంచి హైప్ ను సొంతం చేసుకున్నట్లు మేకర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్న యూట్యూబ్ లో విడుదలైన ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఐదు భాషల్లో కలిపి 34 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. జూన్ 27న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కల్కి 2898 ఏడీ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు సినిమా జానర్ మరియు కథలో ఏముండబోతోందో క్లియర్ గా తెలియజేయడం జరిగింది. అంతా బాగానే ఉంది కాని సినిమా వ్యూస్ కాస్త కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఇండియాలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. ఇక సినిమా ట్రైలర్ మాత్రం అన్ని రికార్డులను క్రాస్ చేయలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిహిస్తోంది.

24 గంటల్లోనే ట్రైలర్ వివిధ భాషల్లో ఈ విధంగా వ్యూస్ సాధించింది:

తమిళంలో: 2.3 మిలియన్ వ్యూస్

కన్నడలో: 949K వ్యూస్

తెలుగులో: 14 మిలియన్ వ్యూస్

హిందీలో: 16 మిలియన్ వ్యూస్

మలయాళంలో: 1 మిలియన్ వ్యూస్

ఈ ట్రైలర్ వ్యూస్ గణనీయమైనవి అయినప్పటికీ, అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 10 భారతీయ ట్రైలర్ల జాబితాలో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయింది. అసలే యాక్షన్ స్కై ఫై ఫిల్మ్. ప్రభాస్ ను ఫ్యాన్స్ సరికొత్త లుక్ లో చూడబోతున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్.. ఇలా బిగ్ స్టార్స్ ఉన్నారు. అలాంటప్పుడు ట్రైలర్ 24 గంటల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ లెక్క క్రాస్ కాలేదు.

24 గంటల్లో అత్యధికంగా వ్యూస్ సాధించిన టాప్ ఇండియన్ ట్రైలర్స్ జాబితా ఇదే..

సలార్: 113.2M

కేజీఎఫ్ 2: 106.5M

ఆదిపురుష్: 74M

సలార్ (సెకండ్ ట్రైలర్): 72.2M

అనిమల్: 71.4M

డంకీ: 58.5M

రాధే శ్యామ్: 57.5M

జవాన్ (ప్రివ్యూ): 55M

ఆర్ఆర్ఆర్: 51.1M

తు ఝూటీ మై మక్కార్: 50.9M

ఇతర తెలుగు ట్రైలర్లతో పోలిస్తే, కల్కి 2898 ఏడీ 24 గంటల్లో 14 మిలియన్ వ్యూస్ సాధించింది. గుంటూరు కారం, సలార్, సర్కారు వారి పాట ట్రైలర్లు టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. అయితే యూట్యూబ్ వ్యూస్ ఎల్లప్పుడూ బాక్సాఫీస్ సక్సెస్ ను నిర్దేశించవు. కొన్ని చిత్రాలు భారీ వ్యూస్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. మరికొన్ని చిత్రాలు సగటు వ్యూస్ ఉన్నప్పటికీ, టికెట్ కౌంటర్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించాయి. కల్కి 2898 ఏడీ ట్రైలర్ పై మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ లోని విజువల్స్, కథన శైలి ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచాయి. యూట్యూబ్ వ్యూస్ తప్పక సినిమాకు మంచి హైప్ ను ఇచ్చాయని చెప్పొచ్చు.