Begin typing your search above and press return to search.

'మనిషి మారడు.. మారలేడు'.. కల్కి సెకండ్ ట్రైలర్ వేరే లెవల్!

తాజాగా ఫైనల్ వార్ పేరుతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కల్కి ఫస్ట్ ట్రైలర్ అంచనాలు పెంచితే.. రీసెంట్ ట్రైలర్ ఆకాశాన్ని తాకేలా చేసేసింది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:09 PM GMT
మనిషి మారడు.. మారలేడు.. కల్కి సెకండ్ ట్రైలర్ వేరే లెవల్!
X

కల్కి 2898 ఏడీ మూవీ కోసమే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మరో 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కొత్త కొత్త ప్లాన్లతో అందరి దృష్టి తమవైపు తిప్పుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్సెస్, ప్రీ లూడ్ వీడియోస్ వేరే లెవల్ లో ఆకట్టుకున్నాయి. కొన్ని రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచేసింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉండనున్నట్లు ఈజీగా చెప్పేసింది. తాజాగా ఫైనల్ వార్ పేరుతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కల్కి ఫస్ట్ ట్రైలర్ అంచనాలు పెంచితే.. రీసెంట్ ట్రైలర్ ఆకాశాన్ని తాకేలా చేసేసింది.

సమయం వచ్చింది.. అంటూ అశ్వత్థామ రోల్ లో అమితాబ్ చెప్పిన డైలాగ్ తో రిలీజ్ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దీపిక కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడని చెబుతారు అమితాబ్. ఆ బిడ్డను కాపాడడానికి ప్రత్యర్థులతో యుద్ధానికి సిద్ధమవుతారు. భైరవ పాత్రలో ప్రభాస్ తో అమితాబ్ ఫైట్ చేస్తారు. ఆ సమయంలో విజువల్స్ అదిరిపోయాయి. మనిషి మారడు.. మారలేడు అంటూ విజువల్ ఫీస్ట్ తో వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఆ తర్వాత ట్రైలర్.. అంతా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లింది. దీపికను చంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంటారు. ట్రైలర్ చివరలో ప్రభాస్ పెద్ద రోబోతో ఫైట్ కు రావడం హైలెట్ గా నిలిచింది. ప్రభాస్ మరోసారి అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే హైలెట్ గా ఉండనున్నాయని అర్థమవుతోంది. అసలు దీపిక కడుపులో ఉన్న బిడ్డ ఎవరు? ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తారు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తో పాటు అనేక మంది ప్రముఖులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హాలీవుడ్ నుంచి అనేక మంది రంగంలో దిగి.. ఈ సినిమా కోసం వర్క్ చేశారు. మరి జూన్ 27వ తేదీన కల్కి 2898 ఏడీ సినిమా.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.