Begin typing your search above and press return to search.

నాగ్ అశ్విన్ కూడా యూనివర్స్ అంటున్నాడంటే..

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   30 May 2024 4:45 AM GMT
నాగ్ అశ్విన్ కూడా యూనివర్స్ అంటున్నాడంటే..
X

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ నాని కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. దీని తర్వాత మహానటి సావిత్రి బయోపిక్ ని తెరపై ఆవిష్కరించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. కీర్తి సురేష్ ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. అలాగే నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ సారో మూడో చిత్రంతో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ కి గురి పెట్టాడు.

ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవరూ టచ్ చేయని ఫ్యూచరిస్టిక్ జోనర్ లో కల్కి 2898ఏడీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని శ్రీమహావిష్ణు 10వ అవతారం కల్కి రాకని ముందు తెరపై చూపించబోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రెడీ అవుతోన్న ఈ సినిమా జూన్ 28న వరల్డ్ వైడ్ గా 22 భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

కచ్చితంగా కల్కి 2898ఏడీ మూవీతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా సినిమాటిక్ యూనివర్స్ లను బిల్డ్ చేస్తున్నారు. హాలీవుడ్ లో మార్వెల్, ఎక్స్ మెన్, స్టార్ వార్ తరహాలోనే ఒకే రకమైన కథలని సీక్వెల్స్ గా ఒకదానికొకటి లింక్ చేస్తూ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలని తెరకెక్కిస్తున్నారు.

తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరో స్టోరీస్ ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే హనుమాన్ మూవీ వచ్చింది. ఇప్పుడు రణవీర్ సింగ్ తో ఓ మూవీ అవుతోంది. జై హనుమాన్ కూడా నెక్స్ట్ ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా కల్కి 2898ఏడీని సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే చేయబోతున్నాడంట.

ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. కల్కి2898ఏడీ మూవీ యూనివర్స్ కథలలో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఈ కథకి కొనసాగింపు ఉండబోతోందని స్పష్టం అవుతోంది. మార్వెల్ సిరీస్ తరహాలోనే కల్కి సిరీస్ కూడా ఉంటుందనే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. గతంలో హీరో రానా కూడా ఓ ఇంటర్వ్యూలో కల్కికి కొనసాగింపుగా మార్వెల్ సిరీస్ తరహాలో చాలా మూవీస్ వస్తాయని చెప్పారు.