Begin typing your search above and press return to search.

కల్కి కోసం ఆ ఇద్దరు సూపర్‌ స్టార్స్ వచ్చేశారు

మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తో పాటు యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్ కూడా హైదరాబాద్ చేరుకున్నట్లు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:02 AM GMT
కల్కి కోసం ఆ ఇద్దరు సూపర్‌ స్టార్స్ వచ్చేశారు
X

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న 'కల్కి' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ యూఎస్ వెళ్లాడు. దాదాపు 50 రోజుల తర్వాత ప్రభాస్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెల్సిందే.

ప్రభాస్ వచ్చిన వెంటనే 'కల్కి 2898 ఏడీ' షూటింగ్ ను మొదలు పెట్టారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్‌ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తో పాటు యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్ కూడా హైదరాబాద్ చేరుకున్నట్లు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

కమల్‌ హాసన్‌ చాలా స్పీడ్ గా ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ ను ముగించే పనుల్లో ఉన్నాడు. అయినా కూడా కమల్‌ 'కల్కి' సినిమా కోసం ఇండియన్ 2 కి బ్రేక్ ఇచ్చాడని సమాచారం అందుతోంది.

ఈ షెడ్యూల్‌ లో ప్రభాస్‌, అమితాబచ్చన్‌, కమల్ హాసన్‌, దీపికా పదుకునే ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొంటున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఉన్నాడు. ఇటీవల సినిమా విడుదల విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షూటింగ్‌ పెండ్డింగ్ ఉండటంతో పాటు గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

కనుక వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా ఆలస్యం అవుతుంది అనే విషయాన్ని దృవీకరించలేదు. సంక్రాంతికి తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.