Begin typing your search above and press return to search.

కల్కి యానిమేటెడ్ సిరీస్ పెద్ద ప్రయోగమే..: నాగ్ అశ్విన్

కల్కి ప్రపంచంలో నాగ్ అశ్విన్ సృష్టించిన బుజ్జి మరియు భైరవ పాత్రలు కొన్ని మిషన్స్ ను నిర్వహించబోతున్నాయి.

By:  Tupaki Desk   |   30 May 2024 3:16 PM GMT
కల్కి యానిమేటెడ్ సిరీస్ పెద్ద ప్రయోగమే..: నాగ్ అశ్విన్
X

ప్రభాస్ నటించిన బిగ్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక దానికి ప్రీల్యూడ్ గా రూపొందించిన 2డి యానిమేషన్ సిరీస్ బుజ్జి అండ్ భైరవ ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కల్కి ప్రపంచంలో నాగ్ అశ్విన్ సృష్టించిన బుజ్జి మరియు భైరవ పాత్రలు కొన్ని మిషన్స్ ను నిర్వహించబోతున్నాయి. ఇక ఆ కథను యానిమేషన్ రూపంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు.


ఇక బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు నాగ్ అశ్విన్ సరికొత్త విషయాలని తెలియజేశారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. భైరవ మరియు బుజ్జి ప్రవేశ సన్నివేశాలపై ప్రేక్షకుల చప్పట్లు చూశాను. వారు ఒక మిషన్ కోసం కలిసి వస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సీరీస్ కథ. కల్కి ప్రపంచానికి ప్రవేశం పొందే చిన్న జ్ఞాపకాన్ని అది చూపించగలదు. ఆ రేణు క్యారెక్టర్స్ వాటి సరికొత్త లోకానికి తీసుకు వెళతాయి.

ముందుగా యానిమేషన్ సిరీస్ విడుదల చేయడం ఒక కొత్త జానర్. ఇది 2 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన. అయితే, ఇది ఎంత కష్టమైనదో అప్పుడు తెలియదు. యానిమేషన్ అనేది ఒక విభిన్నమైన ఆర్ట్ ఫారం. ప్రపంచంలోని అన్ని యానిమేటర్లకు నాకు పూర్తి గౌరవం ఉంది. ఇక వారితో కలిసి పని చేయడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. గ్రీన్ గోల్డ్ అనే సంస్ధ తో కలిసి పని చేశాం, వారు చోటా భీమ్ వంటి అనేక యానిమేషన్ సిరీస్ ను తయారుచేశారు.

మేము చివరి నిమిషంలో మార్పులను కోరినప్పుడు కూడా వారు సహకరించారు. మా ప్రపంచం నుంచి వారితో భాగస్వామ్యం చేసుకోవడం మొదటిసారి. సినిమా కోసమే ఒక డిఫరెంట్ కారును తయారు చేశాం. ఒక విధంగా చెప్పాలి అంటే మూడు విభిన్న కంపెనీలను నడిపించాం- వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్ మరియు వైజయంతీ మూవీస్. ఇది కల్కి ద్వారా సాధ్యమైంది.. అని నాగ్ అశ్విన్ అన్నారు

ఇక మీడియా అలాగే వారి కుటుంబాలకు చెందిన పిల్లల కోసం స్క్రీనింగ్ చేసిన మొదటి ఎపిసోడ్ అద్భుత స్పందన పొందింది. సిరీస్ మే 31 అర్ధరాత్రి 12 గంటల నుండి ప్రైమ్ లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కల్కి సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక టీజర్ యానిమేషన్ సీరీస్ అంటూ ఆ అంచనాల స్థాయిని మరింత పెంచుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.