Begin typing your search above and press return to search.

రికార్డులన్నీ బద్దల్.. కల్కి నయా చరిత్ర!

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీగా నిర్మించిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు నెలకొల్పిన భారీ అంచనాల తగ్గట్లే దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 6:45 AM GMT
రికార్డులన్నీ బద్దల్.. కల్కి నయా చరిత్ర!
X

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీగా నిర్మించిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు నెలకొల్పిన భారీ అంచనాల తగ్గట్లే దూసుకుపోతోంది. నాగి టాలెంట్ అదుర్స్ అని అంతా చెబుతున్నారు.


అయితే రిలీజ్ కు వారం రోజుల ముందే ఓవర్సీస్ లో కల్కి ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎన్నడూ లేనంతగా రికార్డులు క్రియేట్ అయ్యాయి. పోటీ పడి మరీ ఓవర్సీస్ ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ప్రీ సేల్స్ లోనే ఏకంగా 3.8 మిలియన్ క్రాస్ చేసేసింది కల్కి. ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా సంచలన రికార్డు క్రియేట్ చేసింది.

ఇక కల్కి మూవీ మరో ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. నార్త్ అమెరికాలో కల్కి ప్రీమియర్స్ 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి-2 ప్రీమియర్స్ డే కలెక్షన్లను మించి నార్త్ అమెరికాలో కల్కి వసూళ్లు చేసింది. అది కూడా భారీ మార్జిన్ తో రాబట్టింది. దీంతో కల్కి అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోవడం పక్కా.

అయితే దేశంలో తెలుగు రాష్ట్రాలతోపాటు అన్ని చోట్ల కల్కి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మహాభారతంతో లింక్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ కథను రాసుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్ కూడా పురాణాల స్ఫూర్తితోనే సాగుతుందని అంటున్నారు. కాంప్లెక్స్, శంభాలా వ‌ర‌ల్డ్స్ గ్రాఫిక్స్ అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ బాగుందని అంటున్నారు.

ఇక అనుకున్నట్లే సినిమాలో క్యామియో రోల్స్ ఎక్కువగా ఉన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, రాజ‌మౌళి మృణాల్ ఠాకూర్ సహా పలువురు కనిపించే సీన్స్.. ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్ర‌హ్మానందం, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాశ్వ‌త్ ఛ‌ట‌ర్జీ, శోభ‌న తదితర సీనియర్ నటీనటులంతా తమ పాత్రలకు ప్రాణం పోశారు. మొత్తానికి క‌ల్కి 2898 ఏడీ విజువ‌ల్ వండ‌ర్ మూవీగా అందరినీ అలరిస్తోంది.