Begin typing your search above and press return to search.

కల్కి వెయ్యి కోట్ల బ్యాటింగ్.. ఎంతవరకు వెళ్లిందంటే..

డార్లింగ్ ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2024 10:22 AM GMT
కల్కి వెయ్యి కోట్ల బ్యాటింగ్.. ఎంతవరకు వెళ్లిందంటే..
X

డార్లింగ్ ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898ఏడీ థియేటర్స్ లోకి వచ్చి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. నాలుగు వారాల తర్వాత కూడా కల్కి మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ కల్కి చిత్రంలో భవిష్యత్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించారు.


ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొన్న కల్కి చిత్రం తాజాగా 1100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అఫీషియల్ గా పోస్టర్ తో ప్రకటించడం విశేషం. తెలుగులో బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా కల్కి మూవీ నిలిచింది. సౌత్ లో 4వ హైయెస్ట్ కలెక్షన్స్ నెంబర్ అందుకున్న మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో బాహుబలి 2 తర్వాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఈ చిత్రానికి రావడం విశేషం. ఇప్పటికే నార్త్ అమెరికాలో 18 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను కల్కి మూవీ అందుకుంది. నార్త్ ఇండియాలో కూడా 300 కోట్ల కలెక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. నెలరోజుల తర్వాత కూడా చాలా థియేటర్స్ లో 30 నుంచి 50% మధ్యలో ఆక్యుపెన్సీ ఈ సినిమాకి నమోదు అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

విజువల్స్ స్పెక్టాక్యులర్స్ గా ఉండడంతోనే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఇండియన్ ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే మైథాలజీ క్యారెట్టైజేషన్స్ ను ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది కూడా కల్కి సినిమా సక్సెస్ లో ఒక భాగం అని చెప్పొచ్చు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ క్యారెక్టర్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.

అలాగే కల్కికి జన్మనివ్వబోయే సుమతిగా దీపికా పదుకొనే చాలా రోజుల తర్వాత బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఈ సినిమాలో ఇచ్చింది. కల్కి మూవీ గ్రాండ్ సక్సెస్ తో దీనికి సీక్వెల్ గా రాబోయే పార్ట్ 2పైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాని 2026 ఆరంభంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్న యాక్టర్స్ కాల్ సీట్స్ సెట్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేయడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేసుకుంటున్నారు.