Begin typing your search above and press return to search.

కల్కి.. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తాడా?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా ఇంకొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:33 AM GMT
కల్కి.. ప్రభాస్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తాడా?
X

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా ఇంకొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. నార్త్ అమెరికా నుంచి నార్త్ ఇండియా వరకూ.. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో ఓపెనింగ్ డే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనే చర్చలు మొదలయ్యాయి.

ప్రభాస్ 'బాహుబలి 2' సినిమాతో ఫస్ట్ డే రూ. 217 కోట్లకి పైగా ఓపెనింగ్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా దాన్ని బీట్ చేసి ₹ 223 కోట్ల వసూళ్లతో, అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. అయితే ప్రభాస్ తన రికార్డు తానే అందుకోడానికి చాలా ఏళ్లుగా కష్టపడుతున్నారు. 'సలార్' తో ₹178 కోట్ల వరకూ వచ్చి ఆగాడు. ఇప్పుడు 'కల్కి' సినిమాతో తొలి రోజు 200 కోట్లకి పైగా కలెక్షన్లు తీసుకొస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఒకవేళ 'కల్కి 2898 AD' మూవీ ఓపెనింగ్ డే 200 కోట్ల మార్క్ టచ్ చేస్తే, నిజంగానే ఇది సంచలననే. అదే జరిగితే రెండు 200 కోట్ల ఓపెనర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. అంతేకాదు రాజమౌళి ప్రమేయం లేకుండా 200 కోట్లు కొల్లగొట్టిన హీరో అనిపించుకుంటాడు. ఇప్పటికైతే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ సేల్స్ చూస్తే ఈ ఫీట్ అందుకోవడం డార్లింగ్ కు కష్టమేమీ కాదని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. టాక్ బాగుంటే ట్రిపుల్ ఆర్ రికార్డ్ కూడా బ్రేక్ అవుతుందని అంటున్నారు. మరి డార్లింగ్ 'బాహుబలి 2' తో తను క్రియేట్ చేసిన రికార్డును తానే బీట్ చేస్తాడా? RRR ఓపెనింగ్స్ వరకూ వెళ్తాడా లేదా? అనేది చూడాలి.

అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు:

RRR - ₹223 కోట్లు

బాహుబలి 2 - ₹217 కోట్లు

సలార్ - ₹178 కోట్లు

KGF 2 - ₹165 కోట్లు

లియో - ₹148 కోట్లు

ఆదిపురుష్ - ₹140 కోట్లు

సాహో - ₹130 కోట్లు

జవాన్ - ₹129 కోట్లు

యానిమల్ - ₹116 కోట్లు

పఠాన్ - ₹106 కోట్లు

ఇకపోతే 'కల్కి 2898 AD సినిమా ఫస్ట్ డే ఈజీగా రూ. 100 కోట్లకి పైగా వసూళ్లు రాబడుతుందని అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి అర్థమవుతోంది. గతంలో 'బాహుబలి 2', 'సాహో', 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలు వంద కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి. కల్కి ఇప్పుడు రెబల్ స్టార్ కు 5వ వంద కోట్ల ఓపెనర్ అవుతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఇదే హయ్యెస్ట్. షారుఖ్ ఖాన్ కు 'పఠాన్', 'జవాన్' లాంటి రెండు 100 కోట్ల ఓపెనింగ్ డే వసూళ్ల సినిమాలు అంటే.. యశ్ (KGF 2), ఎన్టీఆర్ & రామ్ చరణ్ (RRR), విజయ్ (లియో), రణబీర్ కపూర్ (యానిమల్) లకు ఒక్కో సినిమా ఉన్నాయి