కల్కి ఎఫెక్ట్.. వాడికి కూడా ఫుల్ డిమాండ్..!
వెండితెర మీద ఒక సినిమా అధ్బుతమైన విజయాన్ని అందుకుంది అంటే దాని వెనుక ఎన్నో వందల మంది కష్టం ఉంటుంది.
By: Tupaki Desk | 26 July 2024 9:34 AM GMTవెండితెర మీద ఒక సినిమా అధ్బుతమైన విజయాన్ని అందుకుంది అంటే దాని వెనుక ఎన్నో వందల మంది కష్టం ఉంటుంది. తెర మీద మనకు అందంగా కనిపించే ప్రతి దాని వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. ఇక కల్కి లాంటి భారీ బడ్జెట్ సినిమాలకైతే డే అండ్ నైట్ అనే తేడా లేకుండా చిత్ర యూనిట్ కష్టపడతారు. ఐతే సినిమా రిలీజై సూపర్ హిట్ అయ్యాక ఆ సినిమా తాలూకా వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయి. ఐతే ఈమధ్య పెద్దగా ఏ సినిమాకు బి.టి.ఎస్ పిక్స్ అంత వైరల్ అవ్వలేదు కానీ కల్కి సినిమాకు సంబందించిన బిటిఎస్ స్టిల్స్ మాత్రం హంగామా చేస్తున్నాయి.
కల్కి 2898 AD.. నాగ్ అశ్విన్ కన్న కలని వైజయంతి మూవీస్ నిజం చేసి తెలుగు తెర మీద ఒక అద్భుతాన్ని చూపించింది. ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు అనేలా ప్రూవ్ చేసింది. టెక్నాలజీ పరంగా తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో చూపిస్తుంది. కల్కి చూసిన ప్రతి సినీ అభిమాని నాగ్ అశ్విన్ క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేరు.
ఐతే కల్కిలో విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో వాటికి తగినట్టుగానే పాత్రలు పాత్రధారులు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. అశ్వద్ధామ గా అమితాబ్ బచ్చన్ అయితే ఆఫ్టర్ లాంగ్ టైం స్క్రీన్ మీద అరిపించేశారు. ప్రభాస్ ఎప్పటిలానే భైరవ పాత్రలో అదరగొట్టాడు. క్లైమాక్స్ లో అలా కర్ణుడిగా శాంపిల్ చూపించి థియేటర్ మొత్తం మోత మోగిపోయేలా చేశాడు నాగ్ అశ్విన్.
ఈ సినిమా అందుకున్న గొప్ప విజయానికి కానుకగా ప్రేక్షకులకు సినిమాకు సంబందించిన బిటిఎస్ స్టిల్స్ ని షేర్ చేస్తున్నారు చిత్ర యూనిట్. సినిమా కోసం పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అంతా ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతి అందించే సినిమాను అందించాలనే పనిచేశారు. ఇక నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కల్కి 2898 AD కేవలం 40 శాతం కథ మాత్రమే.. అసలు కథ కల్కి 2 లో ఉంటుందని ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పి కల్కి 2 మీద అంచనాలు పెంచేశాడు నాగ్ అశ్విన్.