Begin typing your search above and press return to search.

కల్కి.. ఓ రిస్క్ ఉంది

కల్కికి పోటీగా హాలీవుడ్ మూవీ అంటే కచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. అయితే కల్కితో పోల్చుకుంటే ఆ సినిమాకే ఒకే రిలీజ్ డేట్ వలన ఇబ్బంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 4:03 AM GMT
కల్కి.. ఓ రిస్క్ ఉంది
X

హీరోలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అన్ని భాషల నుంచి పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ఒకప్పుడు హీరోల మధ్య కాంపిటేషన్ రీజలన్ కి పరిమితం అయ్యేది. ఇప్పుడు నేషనల్ వైడ్ అయిపొయింది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీని పాశ్చాత్య భాషలలో కూడా నాగ్ అశ్విన్ గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ముఖ్యంగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. మే9న ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో సినిమాపై దీని అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ మూవీ ఎలా ఉండబోతోంది అనేది చూపించింది.

అలాగే ఈ చిత్రంలో శ్రీమహావిష్ణు 11వ అవతారం అయిన కల్కిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే 800 సంవత్సరాల తర్వాత జరిగే కథగా మూవీ ఉండబోతోంది. దీపికా పదుకునే, అమితాబచ్చన్, దిశా పటాని లాంటి స్టార్స్ నటిస్తున్నాడు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అయితే అదే రోజున హాలీవుడ్ మూవీ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో రిలేజ్ అవ్వనుంది. కల్కికి పోటీగా హాలీవుడ్ మూవీ అంటే కచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. అయితే కల్కితో పోల్చుకుంటే ఆ సినిమాకే ఒకే రిలీజ్ డేట్ వలన ఇబ్బంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

కల్కి సినిమాకి ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ హైప్ ఉంటుంది. అలాగే ఇండియా నుంచి వస్తోన్న మొట్టమొదటి హాలీవుడ్ సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి. ఇలాంటి టైంలో కల్కికి పోటీగా ఏ సినిమా వచ్చిన నిలబడటం కష్టం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా ఇది సిద్ధం అవుతోంది.