Begin typing your search above and press return to search.

కల్కి.. అసలు పని పూర్తి చేసిన దీపికా

ప్రస్తుతం దీపికా పదుకునే గర్భవతిగా ఉంది. దీంతో జూన్ నెల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోనుంది. ఈ కారణంగా అందరికంటే ముందుగా తన డబ్బింగ్ ని దీపికా పూర్తి చేసిందంట.

By:  Tupaki Desk   |   13 May 2024 11:29 AM GMT
కల్కి.. అసలు పని పూర్తి చేసిన దీపికా
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తెలుగులో చేస్తోన్న మొట్టమొదటి చిత్రం కల్కి 2898ఏడీ. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో జూన్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ సిద్ధం అవుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని ఫిక్షనల్ కథాంశంతో నాగ్ అశ్విన్ ఈ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ ఉంటుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. దీపికా పదుకునే కెరియర్ లోనే అతి పెద్ద సినిమా ఇది కావడం విశేషం. ఈ చిత్రం కోసం దీపికాకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు.

ప్రభాస్ కి జోడీగా చాలా బలమైన క్యారెక్టర్ ని దీపికా పదుకునే ఈ చిత్రంలో చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కల్కి 2898ఏడీలో తన క్యారెక్టర్ కి సంబందించిన డబ్బింగ్ పూర్తి చేసిందంట. హిందీ, కన్నడ భాషలలో దీపికా పదుకునే తన పాత్రకి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీపికా పదుకునే మాతృభాష కన్నడ అనే సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం దీపికా పదుకునే గర్భవతిగా ఉంది. దీంతో జూన్ నెల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోనుంది. ఈ కారణంగా అందరికంటే ముందుగా తన డబ్బింగ్ ని దీపికా పూర్తి చేసిందంట. అలాగే ప్రమోషన్స్ కి కావాల్సిన ఇంటర్వ్యూలు కూడా ముందుగానే ఇవ్వనుందంట. త్వరలో కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ కోసం దీపికా పదుకునే స్పెషల్ ఇంటర్వ్యూని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.

కల్కి 2898ఏడీ చిత్రాన్ని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనతో చిత్ర యూనిట్ ఉంది. దీపికా పదుకునే ఇప్పటికే హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే ఇమేజ్ పాశ్చాత్యదేశాలలో కల్కి మూవీకి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. ఇక ఆమెతో పాటు బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.