Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీలో.. అన్నీ కరెక్ట్ గా సెట్ చేసి..

ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ ని కల్కి 2898ఏడీతో స్టార్ట్ చేశాడు.

By:  Tupaki Desk   |   26 Jun 2024 5:08 AM GMT
కల్కి 2898ఏడీలో.. అన్నీ కరెక్ట్ గా సెట్ చేసి..
X

ప్రస్తుతం మన స్టార్స్ అందరూ కూడా పాన్ ఇండియా కథలపైనా ఫోకస్ చేస్తున్నారు. అలాగే దర్శకులు సినిమాటిక్ యూనివర్స్ లో సిరీస్ తరహాలో మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, అలాగే మరికొన్ని సినిమాటిక్ యూనివర్స్ సౌత్ లో నడుస్తున్నాయి. ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ ని కల్కి 2898ఏడీతో స్టార్ట్ చేశాడు.

ఇందులో మార్వెల్ సిరీస్ తరహాలో సూపర్ హీరో కథలని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నాడు. మైథాలజీ బేస్ చేసుకొని ఫ్యూచరిస్టియక్ కథలు తయారు చేసి కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నెక్స్ట్ సిరీస్ లకి సంబంధించి కల్కి 2898ఏడీలోనే నాగ్ అశ్విన్ లీడ్ ఇస్తున్నాడు. అలాగే పౌరాణిక కథలని టచ్ చేస్తున్నాడు. ఆ కథలలో క్యామియో రోల్స్ కోసం స్టార్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతూ ఉండటం విశేషం.

కల్కి 2898ఏడీ మూవీలో అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్, కలిపురుషుడు పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తున్నారు. భైరవగా సూపర్ హీరో రోల్ ప్రభాస్ చేశాడు. కల్కి, పరశురాముడి పాత్రలని ఎవరు చేస్తున్నారు అనేది రివీల్ చేయలేదు. అలాగే మాళవిక నాయర్, సీనియర్ హీరోయిన్ శోభన, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించారు.

వీరు కాకుండా మూవీలో నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఆర్జీవీ క్యామియో రోల్స్ లో కనిపించబోతున్నారంట. వీరి పాత్రలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. ఈ పాత్రలు పార్ట్ 2కి లీడ్ గా నాగ్ అశ్విన్ ఉపయోగించాడా లేదా పౌరాణిక కథని చెప్పడానికి వాడాడా అనేది తెలియాల్సి ఉంది.

3 గంటల నిడివి ఉండే ఈ సినిమాలో దీపికా పదుకునే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తోంది. మెయిన్ కథ భైరవ, అశ్వద్ధామ పాత్రల మధ్యనే నడుస్తుందంట. అంటే మెజారిటీ కథలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. కమల్ హాసన్ కల్కి మూవీ క్లైమాక్స్ లో రివీల్ అవుతాడంటా. పార్ట్ 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయంట. అందులో ఒకటి థీమ్ సాంగ్ కాగా మరొకటి ప్రభాస్, దిశాపటాని మీద డ్యూయెట్ గా చిత్రీకరించారని తెలుస్తోంది. రెండు కూడా కథలో భాగంగా సరైన టైమ్ లోనే వస్తాయట. ఇక సినిమాలో స్పెషల్ పాత్రలు కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లోనే దించారని తెలుస్తోంది. కల్కి లో ప్రత్యేకంగా నిలిచే కథతో పాటు గెస్ట్ పాత్రలు, పాటలు సమపాళ్లలో సెట్ చేశారు. మరి సినిమా ఆడియెన్స్ కు ఎనీహావరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.