Begin typing your search above and press return to search.

నైజాం బాక్సాఫీస్.. ప్రభాస్ మళ్ళీ బ్లాస్ట్ చేశాడు

ప్రభాస్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 9:32 AM GMT
నైజాం బాక్సాఫీస్.. ప్రభాస్ మళ్ళీ బ్లాస్ట్ చేశాడు
X

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన "కల్కి 2898 AD" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పాన్ ఇండియా చిత్రంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మరియు దిశా పటాని కీలక పాత్రలలో నటించగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాపై ప్రేక్షకులలోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉండడం విశేషం.

ప్రభాస్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు. చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో ఒక పండగ వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు. "కల్కి 2898 AD" తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నైజాం మార్కెట్ లో ఈ సినిమా ప్రాముఖ్యత ఎక్కువగా కనిపించింది.

పీఆర్ నంబర్స్ ప్రకారం, నైజాంలో ఈ సినిమాకు తొలి రోజునే 19.5 కోట్ల షేర్ వచ్చింది. ఇది ఆల్ టైం టాప్ 2 ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది. RRR తర్వాతి స్థానంలో నిలవడం ఈ సినిమాకు మరో ప్రాధాన్యతను ఇచ్చింది. నైజాం లోనే మొదటి రోజుకే సుమారు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించడం "కల్కి 2898 AD" పాన్ ఇండియా స్థాయి సినిమా గా ఉందని నిరూపించింది.

ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటుల సమ్మిళితంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమైంది. ఇక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, కథనం అన్ని కలిపి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి రివ్యూలు పొందడంతో రానున్న రోజుల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ప్రేక్షకుల స్పందన చూస్తే ఈ చిత్రం బిగ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా దూసుకుపోతుందనిపిస్తుంది. మొత్తానికి, "కల్కి 2898 AD" సినిమా మొదటి రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించి ప్రభాస్ ఫ్యాన్స్ కి, చిత్ర యూనిట్ కి మంచి బూస్ట్ ను అందించింది. సీక్వెల్ పై అంచనాలను కూడా పెంచింది. ఇక త్వరలోనే మేకర్స్ సక్సెస్ మీట్ తో ఆడియెన్స్ కు కృతజ్ఞతలు చెప్పబోతున్నారు.