Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ.. విడుదలకు ముందే బాక్సాఫీస్ బ్లాస్ట్

ఇక డార్లింగ్ ప్రభాస్ సినిమాలు అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

By:  Tupaki Desk   |   25 Jun 2024 6:51 AM GMT
కల్కి 2898ఏడీ.. విడుదలకు ముందే బాక్సాఫీస్ బ్లాస్ట్
X

కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. ఓవర్సీస్ లో స్పెషల్ ప్రీమియర్ షో లతో ఒక రోజు ముందుగానే రిలీజ్ కాబోతోంది. ఏకంగా 22 ఇండియన్ భాషలలో కల్కి 2898ఏడీ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్ లో ఇండియన్ సినిమాలకి ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ లభిస్తోంది.

ఇక డార్లింగ్ ప్రభాస్ సినిమాలు అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో ప్రీమియర్ షోల ద్వారా భారీ కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈజీగా 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ప్రభాస్ సినిమాలు అందుకుంటున్నాయి. సినిమా సినిమాకి అతని మార్కెట్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

సలార్ మూవీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్స్ ని అందుకుంది. జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు మూవీ 2.7 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ బుకింగ్ కలెక్షన్ నెంబర్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రెండు రోజుల్లోనే సలార్ ప్రీమియర్ కలెక్షన్స్ ని కల్కి మూవీ బ్రేక్ చేసింది అంటే హైప్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీకి ఊహించని స్థాయిలో పబ్లిక్ నుంచి ఆదరణ లభిస్తూ ఉండటం నిజంగా షాకింగ్ కి గురిచేసే విషయం అని చెప్పాలి. ప్రభాస్ ఓవర్సీస్ మార్కెట్ స్టామినా ఏంటనేది కల్కి 2898ఏడీ మరోసారి ప్రూవ్ చేసింది. బాలీవుడ్ స్టార్స్ కూడా డార్లింగ్ మార్కెట్ దరిదాపుల్లో కూడా లేరని చెప్పాలి.

కల్కి మూవీ ట్రైలర్స్ కి వచ్చిన రెస్పాన్స్, స్టార్ క్యాస్టింగ్, హాలీవుడ్ స్టాండర్డ్స్ విజువలైజేషన్, ఇండియన్ మైథాలజీ థీమ్ సినిమాకి మెయిన్ అస్సెట్స్ గా ఉన్నాయి. వీటి కారణంగా ఎవ్వరూ ఊహించని స్థాయిలో కల్కి2898ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ఫస్ట్ డే ఆల్ మోస్ట్ థియేటర్స్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తో కల్కి 2898ఏడీ మూవీ మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.