Begin typing your search above and press return to search.

కల్కి బాలీవుడ్... మొదటి రోజే షాకయ్యేలా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై ఆడియన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2024 5:12 AM GMT
కల్కి బాలీవుడ్... మొదటి రోజే షాకయ్యేలా..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై ఆడియన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ క్రియేట్ చేసిన హైప్ తో.. తొలిరోజే మూవీ చూడాలని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వడమే లేటు.. రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు సినీ ప్రియులు.

అయితే అమెరికాలో కల్కి ప్రీ బుకింగ్స్ వారం క్రితమే మొదలయ్యాయి. పెద్ద ఎత్తున రికార్డులు బ్రేక్ అయ్యాయి. అప్పుడే 3 మిలియన్ కూడా క్రాస్ అయింది. తెలంగాణ, కర్ణాటక సహా దేశంలో అనేక ప్రాంతాల్లో రీసెంట్ గా ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. కొన్ని నిమిషాల్లో హౌస్ ఫుల్స్ కనిపించాయి. బుక్ మై షో వెబ్ సైట్ అండ్ యాప్ క్రాష్ కూడా అయ్యాయి. దీంతో ఈ మూవీపై క్రేజ్ ఎలా ఉందో ఈజీగా అర్థమైపోతుంది .

ఇక బాలీవుడ్ లో కూడా కల్కి మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. కల్కి దూకుడు చూసి బీటౌన్ సినీ పండితులు కూడా షాక్ అవుతున్నారట! తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... నార్త్ లో కూడా అదే జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ ప్రకారం చూసుకుంటే.. బీటౌన్ లో కల్కి రూ.20 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. అయితే తొలి షో పడ్డాక.. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే రూ.25 కోట్లు కూడా రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీలను మేకర్స్ రంగంలోకి దించిన విషయం తెలిసిందే. అమితాబ్, దీపిక లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవల మేకర్స్ ముంబైలో ప్రీ లాంఛ్ పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ చేశారు. భైరవ యాంథమ్ కూడా పంజాబీ టచ్ తో నార్త్ ఇండియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి కల్కి.. బాలీవుడ్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

భారత పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించారు. సుమారు రూ.600 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్స్ ద్వారా.. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, యాక్షన్, ఎమోషన్ అలా అన్ని అంశాలతో సినీ ప్రేక్షకులను వేరే లోకంలోకి కల్కి తీసుకెళ్తుందని అర్థమవుతుంది. మరి ఈ మూవీ టికెట్స్ ను మీరు బుక్ చేసుకున్నారా?