Begin typing your search above and press return to search.

ప్రభాస్.. హృతిక్ లెక్క కూడా బ్లాస్ట్ అయ్యింది!

కల్కి 2898ఏడీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   9 July 2024 11:28 AM GMT
ప్రభాస్.. హృతిక్ లెక్క కూడా బ్లాస్ట్ అయ్యింది!
X

కల్కి 2898ఏడీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. 600+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి చెప్పడంతో కల్కి మూవీ కథ అందరికి కనెక్ట్ అయ్యింది. డార్లింగ్ ప్రభాస్ మాస్ ఇమేజ్, అమితాబ్ బచ్చన్ చరిష్మా, దీపికా పదుకునే క్రేజ్ తో కల్కి 2898ఏడీ సినిమాకి మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

మొదటి నాలుగు రోజుల్లోనే కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తరువాత వీక్ డేస్ లో కలెక్షన్స్ కొంత వరకు డ్రాప్ అయ్యాయి. అయితే డీసెంట్ వసూళ్లని అందుకుంటూ థియేటర్స్ లో మూవీ కొనసాగుతోంది. ఇప్పటికే 900+ కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. 1000 కోట్ల వసూళ్ల దిశగా మూవీ దూసుకుపోతోంది. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ విషయంలో ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

అయితే ఓవరాల్ గా మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అశ్వద్ధామ, కర్ణుడి క్యారెక్టర్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్స్ ఇప్పటికే 200+ కోట్లు క్రాస్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలై హిందీలో 200+ కోట్లు కలెక్షన్స్ ని అందుకోవడం ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఈ ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది.

హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ ఈ ఏడాది హిందీలో 215 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 2024లో బాలీవుడ్ లో ఇదే హైయెస్ట్ కలెక్షన్. అయితే కల్కి మూవీ 12 రోజుల్లో 219 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ఫైటర్ మూవీని క్రాస్ చేసింది. హిందీలోని స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లని కల్కి సినిమా కలెక్ట్ చేయడం విశేషం. హిందీలో గత ఏడాది వచ్చిన జవాన్, పఠాన్, గద్దర్ సినిమాలు గత రెండేళ్లలో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా ఉన్నాయి.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన మూవీగా కల్కి నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటించారు. అలాగే బెంగాలీ యాక్టర్ మరో ప్రతినాయకుడిగా కనిపించారు. శోభన, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలలో మెరిశారు. కల్కి 2898ఏడీ మూవీ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా రాబోయే కల్కి 2898ఏడీ పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.