Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD: బాక్సాఫీస్ వద్ద ఎంత వస్తే హిట్టు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ సినిమా సినిమాకి పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 2:31 PM GMT
కల్కి 2898 AD: బాక్సాఫీస్ వద్ద ఎంత వస్తే హిట్టు..?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ సినిమా సినిమాకి పెరిగిపోతోంది. పాన్ ఇండియా స్టార్ నుంచి కల్కి మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ కి డార్లింగ్ ఇమేజ్ వెళ్లబోతోంది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని 600+ కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ 22 భాషలలో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీని చాలా ఏరియాలలో అడ్వాన్స్ బేస్ లో డిస్టిబ్యూటర్స్ తో ఒప్పందం చేసుకొని వైజయంతీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా మూవీపైన భారీగానే బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కూడా కల్కి 2898ఏడీపై సాలిడ్ గా థీయాట్రికల్ బిజినెస్ అయ్యింది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రాబోతున్న మూవీ కావడంతో అంచనాలు హైఎండ్ లోనే ఉన్నాయి.

అలాగే మూవీ నుంచి వచ్చిన రెండు ట్రైలర్స్ కి ‘ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కచ్చితంగా మొదటి రోజు సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ మూవీ తెలుగు రాష్ట్రాలలో జరిగిన బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. నైజాంలో కల్కి రైట్స్ 70 కోట్లకి అమ్ముడయ్యాయి. సీడెడ్ లో 27 కోట్ల బిజినెస్ జరిగింది.

ఇక ఆంధ్రాలో అత్యధికంగా 85 కోట్ల వ్యాపారం కల్కిపైన జరిగింది. ఓవరాల్ గా 182 కోట్లకి తెలుగు రాష్ట్రాలలో కల్కి 2898ఏడీ మూవీ డీల్స్ క్లోజ్ అయ్యాయి. అంటే భారీ టార్గెట్ తోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. బ్రేక్ ఈవెంట్ రావాలంటే కనీసం 185 కోట్ల షేర్ ని కల్కి చిత్రం అందుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.

ఏపీలో టికెట్ పై 100 రూపాయిలు అదనంగా పెంచుతున్నారు. తెలంగాణాలో అయితే మల్టీ ప్లెక్స్ లలో ఒక ధర, సింగిల్ స్క్రీన్స్ లో ఒక రేట్ ఉండబోతోంది. మొదటి రోజు అయితే తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మూవీకి వచ్చిన టాక్ బట్టి సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. ఈ మూవీతో ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

కల్కి 2898 వరల్డ్ వైస్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్

ఆంధ్రా: రూ.85 కోట్లు

సీడెడ్: 27 కోట్లు

నైజాం: 70 కోట్లు

మొత్తం APTS రూ. 182 కోట్లు

తమిళనాడు, కేరళ రూ.22 కోట్లు

కర్ణాటక: రూ.30 కోట్లు

నార్త్ ఇండియా రూ. 80 కోట్లు అడ్వాన్స్ కమీషన్ బేసిస్

APTS మినహా మొత్తం భారతదేశం రూ. 132 కోట్లు

ఓవర్సీస్ విలువ రూ.80 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 394 కోట్లు

నాన్ థియేట్రికల్ గా కల్కి సినిమా ఇప్పటికే బడ్జెట్ లో సగానికి పైగా వెనక్కి తెచ్చేసింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం క్లిక్కయినా కూడా మంచి లాభాలు అందించే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పనిసరి 400 కోట్ల షేర్ కలెక్షన్లు అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే లెక్క 800 కోట్లు దాటాలి. సినిమాకున్న హైప్ చూస్తుంటే 1000 కోట్లు టచ్ చేస్తుందని అనిపిస్తుంది. మరి కల్కి టోటల్ గా ఏ స్థాయిలో ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.