Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్‌లో టాప్-10 భారతీయ సినిమాలు

ఇండియ‌న్ సినిమా ఇప్పుడు అతి భారీ వ్యాపారాన్ని నిర్వ‌హిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Jun 2024 4:53 AM GMT
బ‌డ్జెట్‌లో టాప్-10 భారతీయ సినిమాలు
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ భారీగా విస్త‌రిస్తోంది. ఇటీవ‌లి ప‌రిణామాలు ప‌రిశీలిస్తే సాంకేతికంగా హాలీవుడ్ కి ధీటుగా ఎదిగే దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని చెప్పాలి. ఇండియ‌న్ సినిమా ఇప్పుడు అతి భారీ వ్యాపారాన్ని నిర్వ‌హిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్కెట్ల‌ను అందుకుంటోంది. ఇది ప్రతి సంవత్సరం వంద‌ల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెస్తూ.. అనూహ్య‌ లాభాలను తెస్తోంది. నటీనటులు సిబ్బంది పారితోషికాలు.. ప్రమోషన్‌లు.. మార్కెటింగ్ .. కాస్ట్యూమ్స్, సెట్‌లు, వసతి, ప్రయాణ ఖర్చులు, షూట్ లొకేషన్‌లు, VFX, ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్, వాయిస్‌ఓవర్ .. ఇలాంటివి ఎన్నో ప్రాథమిక ఖర్చులు అమాంతం పెరిగాయి. అగ్రశ్రేణి నటీనటులు, దర్శకులు, అత్యాధునిక సాంకేతికత, విస్తృతమైన మార్కెటింగ్ ప్రచారాలతో సినిమా గ్రాండియారిటీ కోసం బడ్జెట్ వందల కోట్లకు చేరుకుంటోంది.

ఈ గురువారం థియేటర్ల‌లోకి విడుద‌లై బంప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'క‌ల్కి 2898 AD' అత్యంత ఖరీదైన భారతీయ సినిమా అని ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లుగా ఉంద‌ని సమాచారం. ఇది ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా అందుకోనంత పెద్ద మొత్తం. సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ చిత్రంలో టాప్ క్లాస్ VFX ని ఉప‌యోగించారు. VFX కోసం పని చేసిన‌ సంస్థ ఒక‌ హాలీవుడ్ కంపెనీ. ఇది డూన్ - ఓపెన్‌హైమర్ వంటి కొన్ని అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లకు కూడా పని చేసింది.

అయితే ఈ సినిమాకి ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు కావ‌డానికి కేవ‌లం వీఎఫ్ ఎక్స్ మాత్ర‌మే కాదు.. ఎంచుకున్న క‌థ కాన్వాస్ తో పాటు కాస్ట్యూమ్స్, స్టార్ కాస్టింగ్, క‌ళాద‌ర్శ‌క‌త్వం, కెమెరా టెక్నాల‌జీ ఇలా ప్ర‌తిదీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వే. దీంతో సుమారు 600 కోట్లు వైజ‌యంతి మూవీస్ నిర్మాణం కోసం పెట్టుబ‌డిగా పెట్టింది.

బాహుబ‌లి త‌ర్వాత పోటీ త‌త్వంతో నిర్మాణ సంస్థ‌లు బ‌డ్జెట్ల‌ను పెంచేసాయి. పెరుగుతున్న బడ్జెట్‌లతో నిర్మాణ విలువలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఇప్పటివరకు విజువ‌ల్స్ ప‌రంగా అద్భుతమైన ఖరీదైన సినిమాలు కొన్ని వచ్చాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1. కల్కి క్రీ.శ. 2898 - రూ. 600 కోట్లు

2. RRR - 550కోట్లు

3. పొన్నియన్ సెల్వన్- 550 కోట్లు

4.ఆదిపురుష్ - రూ. 500 కోట్లు

5. ర‌జ‌నీకాంత్ 2.0 - 500కోట్లు

6. బాహుబలి: ది బిగినింగ్ - 250 కోట్లు

7. బ్రహ్మాస్త్ర1 - రూ. 375 -రూ. 400 కోట్లు

8. సాహో , బడే మియాన్ చోటే మియాన్ - రూ 350 కోట్లు

9. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, జవాన్, టైగర్ 3, లియో, ది గోట్ - రూ. 300 కోట్లు

10. స‌లార్: పార్ట్ 1 - రూ. 270 కోట్లు

11. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, పఠాన్, ఫైటర్, మైదాన్ - రూ 250 కోట్లు-350కోట్లు

12. ర‌ణ‌వీర్ 83 - రూ. 200 నుండి రూ. 250 కోట్లు