కల్కి వెయిటింగ్.. ఇది అసలు మ్యాటర్!
హిందూ పురాణాల్లోని పలు పాత్రలను మోడ్రన్ సూట్స్ లో చూపించి ఆడియన్స్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ థ్రిల్ చేయబోతున్నారు.
By: Tupaki Desk | 7 March 2024 6:53 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు సినీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్.. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. హిందూ పురాణాల్లోని పలు పాత్రలను మోడ్రన్ సూట్స్ లో చూపించి ఆడియన్స్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ థ్రిల్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది.
ఇటలీలోని అద్భుతమైన లొకేషన్స్ లో ప్రభాస్, దిశా పటానీపై పాట చిత్రీకరిస్తున్నారు కల్కి మేకర్స్. ఇటీవల క్రేజీ పిక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక రోజురోజుకూ సినిమాపై బజ్ మరింత పెరిగిపోతోంది. అయితే మేకర్స్ ఈ సినిమాను.. మే 9న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని సినీ వర్గాల్లో తెగ చర్చ నడుస్తోంది. 2024 ఏడాది చివరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని చాలా మంది అంటున్నారు.
ఇప్పటికే కల్కి మూవీ టీమ్ చాలా సార్లు రిలీజ్ డేట్ విషయంపై వస్తున్న రూమర్స్ ను ఖండించింది. అయితే ప్రమోషన్స్ ను మేకర్స్ ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో మే9 వ తేదీన కల్కి వస్తుందా రాదా అనే ప్రచారం సినీ వర్గాల్లో ఊపందుకుంటోంది. కానీ మేకర్స్ మాత్రం అనుకున్న తేదీకి వచ్చేస్తున్నామన్న థీమాతో ఉన్నారు.
అయితే కల్కి మూవీ లాస్ట్ స్టేజ్ సీజీ వర్క్ ఫ్రేమ్స్ రావాల్సి ఉందట. అవి అనుకున్న సమయానికి వచ్చి, క్వాలిటీ అప్ టు ది మార్క్ ఉంటే మే 9వ తేదీన మూవీ విడుదల కావడం పక్కా అంట. ఒకవేళ క్వాలిటీ మ్యాచ్ కాకపోతే.. మళ్లీ రీవర్క్ చేయాల్సి ఉంటుందట. సినిమా రిలీజ్ కు అదొక్కటే సమస్యంట. సీజీ వర్క్ ఫ్రేమ్స్ కోసం మూవీ టీమ్ వెయిటింగ్ చేస్తోందట.
వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే శివరాత్రి సందర్భంగా శుక్రవారం కల్కి ప్రాజెక్ట్ నుంచి టీజర్ లేదా సాంగ్ అప్డేట్ రానుందట. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు ఓ గ్లింప్స్ మాత్రమే విడుదల అయ్యింది. ఆ చిన్న గ్లింప్స్ తోనే ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిన మూవీ టీమ్.. కొత్త అప్డేట్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.