Begin typing your search above and press return to search.

ఆమెకి 'పెళ్లి' పై నమ్మకం, ఆసక్తి పోయిందట

హ్యాష్‌ బర్గ్‌ తో మూడు సంవత్సరాలుగా కలిసి ఉంటున్న కల్కి ప్రస్తుతం తన బిడ్డతో గోవాలో సంతోషంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది

By:  Tupaki Desk   |   3 Aug 2023 4:14 AM GMT
ఆమెకి పెళ్లి పై నమ్మకం, ఆసక్తి పోయిందట
X

బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన కల్కి కొచ్లిన్‌ ఈ మధ్య కాలంలో ముంబై ను వీడి గోవాలో ఉంటున్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు మాత్రమే ముంబై కి వచ్చి పోతూ ఉందట. ఆమె అనురాగ్ కశ్యప్‌ తో విడాకులు తీసుకున్న తర్వాత హ్యాష్‌ బర్గ్‌ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం అతడితో సహజీవనం సాగిస్తోంది.

కల్కి కొచ్లిన్‌ పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. హ్యాష్‌ బర్గ్‌ తో మూడు సంవత్సరాలుగా కలిసి ఉంటున్న కల్కి ప్రస్తుతం తన బిడ్డతో గోవాలో సంతోషంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. సహజీవనం సాగిస్తున్న హ్యాష్‌ బర్గ్ ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ కల్కి ని ప్రశ్నించిన సమయంలో ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.

విడాకుల తర్వాత తనకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయిందని పేర్కొంది. పెళ్లి అంటే నమ్మకం లేకపోవడంతో పాటు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదని ప్రస్తుతం హ్యాష్‌ బర్గ్‌ తో ఉన్న రిలేషన్ తో చాలా సంతోషంగా ఉన్నట్లుగా కల్కి వెల్లడించింది. ముందు ముందు కూడా పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె పేర్కొంది.

నాకు మాత్రమే కాదు హ్యాష్ కి కూడా పెళ్లి పై సదాభిప్రాయం లేదు. అందుకే మేము ఇద్దరం సహజీవనం లోనూ చాలా సంతోషంగా ఉన్నామని ఆమె పేర్కొంది. తాను హ్యాష్ బర్గ్‌ ను మొదట ఇజ్రాయెల్‌ లో అందమైన ప్రదేశంలో కలిశాను. ఇద్దరికి కూడా అలాంటి ప్రదేశం అంటే ఇష్టం. అందుకే మా పాపను అలాంటి ప్రదేశంలో పెంచాలనే ఉద్దేశ్యంతో గోవాలో ఉంటున్నట్లుగా కల్కి చెప్పుకొచ్చింది.