Begin typing your search above and press return to search.

కల్కి మూవీ.. అలా జరిగితే బొమ్మ హిట్టే!

టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను కచ్చితంగా చూసి తీరాల్సిందనే విధంగా అన్ని వర్గాల ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 11:30 PM GMT
కల్కి మూవీ.. అలా జరిగితే బొమ్మ హిట్టే!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను కచ్చితంగా చూసి తీరాల్సిందనే విధంగా అన్ని వర్గాల ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి పలువురు స్టార్ నటీనటులు భాగమైన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించారు. బడ్జెటే కాదు.. ప్రమోషన్స్ ను కూడా భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. కొన్ని రోజుల క్రితం అశ్వత్థామ రోల్ ను చేస్తున్న అమితాబ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఐపీఎల్ మ్యాచుల మధ్యలో ప్రభాస్.. భైరవ గెటప్ లో సందడి చేశారు.

సినిమాలోని ప్రభాస్ వెహికల్ బుజ్జిని ఇటీవల రివీల్ చేశారు మేకర్స్. రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు. అందులో ప్రభాస్.. బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అలరించారు. ఆ తర్వాత మేకర్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ చేసిన బుజ్జి అండ్ భైరవ ప్రీ లూడ్ వీడియోస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ కు ముందే పాత్రలను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ విధానానికి అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు.

అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో ఆయన కామెడీ టైమింగ్ ను ఫ్యాన్స్ బాగా మిస్ అయ్యారు. ఇప్పుడు కల్కి మూవీలో కూడా భైరవ రోల్ లో ప్రభాస్ చాలా సీరియస్ గా కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదని నాగ్ అశ్విన్ బుజ్జి అండ్‌ భైరవ యానిమేషన్‌ వీడియోస్ తో ఇన్ డైరెక్ట్ గా ప్రూవ్ చేశారు.

సిరీస్ లో భైరవ, బుజ్జి మధ్య అదిరిపోయే కామెడీ ఉంది. చాలా మంది ఫ్యాన్స్.. భైరవ బాడీ లాంగ్వేజ్ బుజ్జిగాడులో ప్రభాస్ క్యారెక్టర్ ను గుర్తుచేస్తుందని చెబుతున్నారు. కామెడీని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు. సీరియస్ సబ్జెక్ట్ కు సమపాళ్లలో కామెడీ యాడ్ అయితే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంటున్నారు. సిరీస్ లో లాగా సినిమాలో కూడా కామెడీ ఉంటే వేరే లెవెల్ అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ మూవీలో నాగ్ అశ్విన్ ప్రభాస్ రోల్ ను ఎలా క్రియేట్ చేశారో వేచి చూడాలి.