Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ కింగ్.. ఎవరైనా నీ తరువాతే డార్లింగ్

ఇక ఓవర్సీస్ పరంగా చూసుకున్న ప్రభాస్ కి తిరుగులేదని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:13 AM GMT
ఓవర్సీస్ కింగ్.. ఎవరైనా నీ తరువాతే డార్లింగ్
X

దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న టాప్ హీరోల్లో ప్రభాస్ ఒకరు. బాహుబలి అనంతరం బాలీవుడ్ స్టార్స్ ని సైతం బీట్ చేసి ప్రభాస్ తన మార్కెట్ ని పెంచుకుంటూ పోయారు. 500+ కోట్ల వరకు ప్రస్తుతం ప్రభాస్ కి మార్కెట్ వేల్యూ ఉందనే మాట వినిపిస్తోంది. ఆయన నుంచి రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక ఓవర్సీస్ పరంగా చూసుకున్న ప్రభాస్ కి తిరుగులేదని చెప్పొచ్చు. అక్కడ కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా డార్లింగ్ టాప్ చైర్ లో ఉన్నారు. ఏ హీరో సినిమాకి జరగని స్థాయిలో ప్రభాస్ చిత్రాలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. సినిమా సినిమాకి ప్రభాస్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ పరంగా చూసుకుంటే గతంలో ఫాస్టెస్ట్ 500కె డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన మూవీగా సలార్ నిలిచింది.

ఇప్పుడు ఆ రికార్డ్ ని కల్కి 2898ఏడీ మూవీ బ్రేక్ చేసింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ పరంగా ట్రెండ్ సృష్టిస్తోంది. అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన చిత్రం కల్కి మూవీ నిలబడింది. ఇప్పటి వరకు 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కల్కి చిత్రం వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రిలీజ్ అయ్యే లోపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3-4 మిలియన్ డాలర్స్ ని కల్కి 2898ఏడీ మూవీ కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇండియన్ బాక్సాఫీస్ లో ఏ ఒక్క హీరో సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావడం లేదు. షారుఖ్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆ సినిమాలు కూడా డార్లింగ్ మార్కెట్ ని బ్రేక్ చేయలేకపోయాయి.

ఇదిలా ఉంటే కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ పాన్ వరల్డ్ చిత్రాన్ని నిర్మించింది. ఏకంగా 22 భాషలలో కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ గా కల్కి2898 ఏడీ గురించి చర్చ జరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. తప్పకుండా సినిమా 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందనేలా నిర్మాత నమ్మకంతో ఉన్నారు.