Begin typing your search above and press return to search.

కల్కి: సినిమా అంతా ఒకెత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2024 5:55 AM GMT
కల్కి: సినిమా అంతా ఒకెత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. రూ.600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ గ్రాండ్ గా నిర్మించారు. ప్రభాస్ హీరో కావడం, ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో నాగి సినిమా తీయడం, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ట్రైలర్స్ ఉండడం.. వంటి పలు అంశాల వల్ల మూవీపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.

హిందూ పురాణాల్లోని కొన్ని అంశాలను తీసుకుని వాటికి తన విజన్ తో సైన్స్ యాడ్ చేస్తూ నాగ్ అశ్విన్ కల్కి సినిమా రూపొందించారు. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ కంప్లీట్ అయ్యాయి. దీంతో సినిమా చూసిన వారంతా నెట్టింట రివ్యూలు ఇస్తున్నాారు. సినిమా అదిరిపోయందని చెబుతున్నారు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. అంచనాలకు మించి ఉందని పోస్టులు పెడుతున్నారు.

నాగ్ అశ్విన్.. నిన్ననే చెప్పినట్లు ప్రభాస్ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా ఇంట్రో సీన్ మాత్రం అదిరిపోయింది. ఆ సమయంలో థియేటర్లలో ఈలలే ఈలలు. కమల్ హాసన్ రోల్ తో పాటు విజువల్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలను పరిచయం చేస్తూ నెమ్మదిగా సినిమాను నడిపించారు డైరెక్టర్. ఇంటర్వెల్ సీన్ ను మాత్రం అద్భుతంగా ప్లాన్ చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కాస్త తక్కువ టైమే కనిపించారు.

ఇక సెకండాఫ్ లో యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక్కో సీన్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని అంటున్నారు. క్లైమాక్స్ అయితే వేరే లెవల్ లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తం సినిమాకు క్లైమాక్స్ హైలెట్ అని చెబుతున్నారు. గూస్ బంప్స్ తెప్పించే విధంగా నాగ్ అశ్విన్ రూపొందించారని అంటున్నారు. అంచనాలు తగ్గట్లు నాగి.. తనలోని టాలెంట్ తో క్లైమాక్స్ డిజైన్ చేశారని కొనియాడుతున్నారు.

క్లైమాక్స్ లో ఓవైపు అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య ఫైట్.. మరోవైపు యాస్కిన్ పీపుల్ తో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అదిరిపోయే ట్విస్ట్ తో సీక్వెల్ కు నాగి హింట్ ఇచ్చారని అంటున్నారు. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కల్కి వసూళ్ల వర్షం కురిపించడం పక్కా అని అంచనా వేస్తున్నారు. రిలీజ్ కు ముందు ప్రీబుకింగ్స్ లో సత్తా చాటిన కల్కి.. ఇప్పుడు వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.