Begin typing your search above and press return to search.

కల్కి 1000 కోట్ల టార్గెట్.. ఎదురుగా మరో పోటీ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు.

By:  Tupaki Desk   |   5 July 2024 7:46 AM GMT
కల్కి 1000 కోట్ల టార్గెట్.. ఎదురుగా మరో పోటీ?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు. ఇప్పటికే మూవీ 725+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. మరో వారం రోజులు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడిస్తే 1000 కోట్లు కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి మూవీ చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

హిందీ బెల్ట్ లో సినిమాలు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఏడురోజుల్లోనే 725 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి ఎనిమిదో రోజు కూడా 40-50 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక శుక్రవారం, శని, ఆదివారాలు మరల కలెక్షన్స్ పుంజుకునే ఛాన్స్ ఉందనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఇప్పుడు పెద్ద టాస్క్ గా ఉంది.

ఈ వారం అయితే ఎలాగోలా మూవీ గట్టెక్కుతుంది. అయితే జులై 12న సౌత్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 థియేటర్స్ లోకి రాబోతోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఈ ఇండియన్ 2 రాబోతోంది. ఇండియన్ 2 తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఎఫెక్ట్ తెలుగు, హిందీ భాషలలో కల్కిపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అలాగే అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సర్ఫిరా మూవీ కూడా జులై 12న రిలీజ్ కాబోతోంది. సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకి రీమేక్ గా ఈ సర్ఫిరా తెరకెక్కింది. పెద్దగా బజ్ లేకపోయిన అక్షయ్ కుమార్ ఇమేజ్ తో అయిన మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కంటే ముందే కల్కి 1000 కోట్లు క్రాస్ చేయాలి.

లేదంటే ఈ సినిమాల అడ్డంకి తట్టుకొని నిలబడితే లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీకెండ్ తర్వాత కల్కి మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వరకు ఉండొచ్చనేది ఒక అంచనా వచ్చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.