Begin typing your search above and press return to search.

క‌ల్కి అమెరికా రైట్స్ కోసం 50 కోట్లు?

`కల్కి 2898 AD` రోజురోజుకి ఉత్కంఠ రేపుతోంది! ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో ప్రభాస్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 May 2024 2:30 AM GMT
క‌ల్కి అమెరికా రైట్స్ కోసం 50 కోట్లు?
X

`కల్కి 2898 AD` రోజురోజుకి ఉత్కంఠ రేపుతోంది! ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో ప్రభాస్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కూడా నటించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతుండగా ఉత్తర అమెరికా పంపిణీ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ -AA క్రియేషన్స్ సంయుక్తంగా కొనుగోలు చేశాయని తెలుస్తోంది. రిఫండబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన డిస్ట్రిబ్యూటర్లు రూ. 50 కోట్లను చెల్లించారని తాజా మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇది భారతీయ చలనచిత్రానికి అమెరికా రిలీజ్ ప‌రంగా ఘనమైన ఒప్పందం. గతంలో ప్రత్యంగిరా సినిమాస్ ప్రభాస్ నటించిన `సలార్` చిత్రాన్ని పంపిణీ చేసి లాభ‌ప‌డింది. అదే వ్యూహాన్ని `కల్కి 2898 AD` కోసం కూడా అనుసరించనుంది.

ఇక అమెరికా నుంచి 50 కోట్లు రాబ‌ట్ట‌డం అంటే ఆషామాషీ కాదు. మొద‌టి రోజు ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి 2`కి వ‌చ్చిన‌ట్టు పాజిటివ్ టాక్ రావాల్సి ఉంది. బాహుబ‌లి2 చిత్రం మొద‌టి రోజు అమెరికాలో 30 కోట్లు(ప్రీమియ‌ర్లు డే వ‌న్ వ‌సూళ్లు క‌లుపుకుని) వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. రెండు రోజుల్లోనే 50 కోట్లు పైగా వ‌సూలు చేసింది. అంతే స్పీడ్ గా ఇప్పుడు అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద క‌ల్కి చిత్రం ఓపెనింగుల‌ను సాధించాల్సి ఉంటుంది. తెలుగు వెర్ష‌న్ తో పాటు త‌మిళం, హిందీ వెర్ష‌న్ల‌కు ద‌క్కే ఆద‌ర‌ణను బ‌ట్టి కూడా స్పీడ్ గా వ‌సూళ్లు సాధించే వీలుంటుంది.

క‌ల్కి భార‌త‌దేశం స‌హా ఇత‌ర ఏరియాల్లోను అద్భుత బిజినెస్ చేయ‌డానికి ఇటీవ‌లే విడుద‌ల చేసిన బుజ్జి లుక్ స‌హ‌క‌రిస్తోందని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జూన్ మొద‌టి వారంలో రానున్న ట్రైల‌ర్ తో ఈ క్రేజ్ స్కైని ట‌చ్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భాస్ ఈ చిత్రంలో భైర‌వ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, అత‌డి స‌హాయ‌కురాలిగా బుజ్జి- ది రోబోట్ సూప‌ర్ కార్ క‌నిపించ‌నుంది.

`కల్కి 2898 AD` టైటిల్ అర్థాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ గతంలో రివీల్ చేసారు. ``విష్ణువు చివరి అవతారం కల్కి. భ‌విష్య‌త్ లో క‌థ కొన‌సాగుతున్నా కానీ.. గతంతో ఉన్న అనుబంధం సినిమాలో రివీల్ అవుతుంది. ఇది సరైన టైటిల్ అని మేము అనుకున్నాం. భ‌విష్య‌త్ లో అధునాత‌న‌ వాహ‌నాలు ఎలా ఉంటాయో కూడా తెర‌పై ఆవిష్క‌రిస్తున్నాం`` అని తెలిపారు. ఈ సినిమా కోసం సూప‌ర్ కార్ ని డిజైన్ చేయ‌డానికి సుమారు 8 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని కూడా ఇటీవ‌ల‌ క‌థ‌నాలొచ్చాయి. దీనికోసం మ‌హీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మ‌హీంద్రా త‌మ స‌హ‌కారం అందించారు.

అలాగే ఈ సినిమా కోసం ఉప‌యోగించిన ఆయుధాల‌ను సొంతంగా త‌యారు చేయ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం. మేము అందుబాటులో ఉన్న గన్ ప్రాప్‌ని అద్దెకు తీసుకునే కంటే.. రెండు లైట్లపై చప్పట్లు కొట్టి దానిని లేజర్ గన్ అని పిలవడానికి బదులుగా మొదటి నుండి ఆయుధాలను తయారు చేసామని నాగ అశ్విన్ తెలిపారు. ఆయుధాలు త‌యారు చేసే వారికి సహాయం చేయడానికి చాలా VFX చేసాం. అయితే మేము ఇంత‌కుముందు రిలీజ్ చేసిన టీజ‌ర్ పై అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. మేం త‌యారు చేసిన ఆయుధాలు, కార్లు టీజర్‌లో కంటే తెర‌పై చాలా మెరుగ్గా కనిపిస్తాయని ద‌ర్శ‌కుడు తెలిపారు. కల్కి 2898 AD ఎట్ట‌కేల‌కు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంలో విడుదల కానుంది.