Begin typing your search above and press return to search.

కల్కీ లీక్.. ఇవేమీ తలనొప్పులు బాబోయ్

ముఖ్యంగా ఎడిటింగ్ రూమ్ నుంచి విఎఫ్ఎక్స్ జరుగుతున్న స్టూడియోల నుంచి ఈ లీకులు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Sep 2023 4:06 AM GMT

సినిమా ఇండస్ట్రీలో లీకుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లీకుల సమస్య మూవీ రిలీజ్ తర్వాత ఎక్కువగా ఉంటుంది. థియేటర్స్ ప్రింట్ ని ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడం పైరసీ మాఫియా చేసే వారు. అయితే మొదటిసారి అత్తారింటికి దారేది సినిమాతో రిలీజ్ కి ముందే ప్రింట్ ఆన్ లైన్ లోకి రావడం జరిగింది. ఆ ఎఫెక్ట్ కారణంగా అనుకున్న డేట్ కంటే ముందుగానే సినిమాని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ప్రభావం సినిమాకి ప్లస్ అయ్యింది.

అయితే ఈ పైరసీ మాఫియా కారణంగా సినిమా ఇండస్ట్రీకి వందల కోట్ల నష్టం ప్రతి ఏటా వస్తోంది. అయితే ఈ లీకుల బెడద సినిమా షూటింగ్ ల సమయంలోనే మొదలైంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా షూటింగ్ లు అవుతున్న సందర్భంలో ఫోటోలు బయటకి రావడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతూ ఉంటాయి. ఫోటోల వరకు వస్తే అది పెద్ద సమస్య కాదు. కాని ఈ మధ్య కీలకమైన సన్నివేశాలు కూడా బయటకొచ్చేస్తున్నాయి.

ముఖ్యంగా ఎడిటింగ్ రూమ్ నుంచి విఎఫ్ఎక్స్ జరుగుతున్న స్టూడియోల నుంచి ఈ లీకులు జరుగుతున్నాయి. కల్కి సినిమాకి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి బయటకి వచ్చినట్లు చిత్ర యూనిట్ గుర్తించింది. దీంతో నిర్మాతలు ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోపై కేసు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే భారీ మొత్తంలో డ్యామేజ్ కంట్రోల్ క్రింద రాబట్టే ప్రయత్నం చేస్తున్నారంట.

ఇదిలా ఉంటే తాజాగా గేమ్ చేంజర్ మూవీ నుంచి ఓ డ్యూయెట్ సాంగ్ మొత్తం ఆడియో రూపంలో బయటకి వచ్చేసింది. ఆ సాంగ్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై వెంటనే అప్రమత్తమైన దిల్ రాజు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఆ మధ్యకాలంలో ఒక ఫోటో కూడా గేమ్ చేంజర్ మూవీ నుంచి లీక్ అయ్యింది. ఈ ఆడియో ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో తెలుసుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో దిల్ రాజు టీం ఉంది.

మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకి ఈ లీకుల బెడదఇప్పుడు పెద్ద టెన్షన్ గామారింది. కీలకమైన సాంగ్స్, షూటింగ్ సన్నివేశాలు లీక్ కావడం వలన ప్రారంభంలో మూవీకి కొంత హైప్ వచ్చిన తరువాత డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని భావించి నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. పుష్ప 2 షూటింగ్ కి సంబంధించి కూడా కొన్ని సీక్వెన్స్ అలాగే లీక్ అవుతున్నాయి.