కల్కి మూవీ ఓటీటీ క్రేజీ అప్డేట్.. ఇక మూవీ లవర్స్ కి పండగే..
జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన కల్కి చిత్రం ఇప్పటికే సుమారు 1200 కోట్ల కలెక్షన్ కు చేరువలో ఉంది.
By: Tupaki Desk | 31 July 2024 9:36 AMపాన్ ఇండియా సూపర్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ కల్కి. నాగ అశ్విన్ తరికెక్కించిన ఈ మైథాలజీ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సెలబ్రిటీలు నటించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ సుమారు నెలరోజులు కావస్తోంది. ఇక ఈ చిత్రం ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ చిన్ని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన కల్కి చిత్రం ఇప్పటికే సుమారు 1200 కోట్ల కలెక్షన్ కు చేరువలో ఉంది. వీకెండ్ దాటితే సినిమాలు ఆడటం కష్టం అనిపించే ఈ రోజుల్లో విడుదల ఈ నెల రోజులకు పైగా గడుస్తున్న ఇంకా ఈ చిత్రం చాలాచోట్ల ఆడుతూనే ఉంది. ఆగస్టు మొదటి వారంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో కల్కి మూవీ థియేట్రికల్ రన్ పూర్తవుతుందని అనుకుంటున్నారు.
దీంతో కలిపి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అన్న చర్చ బాగా వైరల్ అవుతుంది. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బ్లాక్ బస్టర్ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధం కాబోతోంది అని టాక్ వినిపిస్తోంది. కల్కి సినిమాకు సంబంధించిన తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే కల్కి చిత్రానికి సంబంధించిన హిందీ వర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది.
థియేట్రికల్ రిలీజ్ అయినా 8 వారాల తర్వాత కల్కి చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని ముందుగానే అగ్రిమెంట్ జరిగిందట. దీని ప్రకారం ఆగస్టు 23 ప్రాంతంలో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ముందుగానే ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఇదే జరిగితే లాంగ్ వీకెండ్ మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం కుదురుతుంది. అయితే ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరి నిజంగానే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ లో సందడి చేస్తుందేమో చూడాలి..