కల్కిలో ప్రభాస్ డ్యుయల్ రోల్? నిజమెంత?
కల్కి సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది.
By: Tupaki Desk | 28 April 2024 11:16 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీగా నాగ్ అశ్విన్ కల్కిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 22 భాషల్లో ఈ మూవీ విడుదల కానుందట.
కల్కి సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇక కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఉన్నారు. యుద్ధరంగంలో వీరు ముగ్గురు నిల్చున్నట్టు కనిపిస్తున్న ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో చక్రం, దీపిక, బిగ్ బి లుక్స్ అదిరిపోయాయి.
ఇక ప్రభాస్ లుక్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేరే లెవెల్ లో ఉంది. ఈ పోస్టర్ చూసిన ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది.. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్లతో లేటెస్ట్ లుక్ ను కంపేర్ చేస్తున్నారు. చాలా డిఫరెన్స్ కనిపిస్తోందని అంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నారా అని అనుమానపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే అందులో ఎలాంటి నిజం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పలు భిన్నమైన గెటప్స్ లో నటించి ఉంటారని, డ్యుయల్ రోల్ అయితే కాదని చెబుతున్నారు. ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా.. అంచనాలు పెట్టుకోవద్దని ఫ్యాన్స్ కు సూచిస్తున్నారు. కచ్చితంగా ప్రభాస్ డ్యుయల్ రోల్ చేసి ఉంటే.. మేకర్స్ ఈపాటికే అనౌన్స్ చేసి ఉండేవారని అంటున్నారు.
శ్రీ మహావిష్ణువు పదో అవతారంగా హిందువులు భావించే కల్కి స్ఫూర్తితో ప్రభాస్ రోల్ ఈ సినిమాలో ఉండనుంది. భైరవ అనే పాత్రను ప్రభాస్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మరోవైపు, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆయన క్యారెక్టర్ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మిగతా పాత్రలను కూడా పరిచయం చేయనున్నారట.