Begin typing your search above and press return to search.

కల్కి 2898AD: ప్రభాస్ అంతకుమించి అనేలా..

ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "కల్కి 2898 ఎడి" ఇప్పుడు అంతకుమించి అనేలా ఇంపాక్ట్ చేసేలా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   31 May 2024 9:42 AM GMT
కల్కి 2898AD: ప్రభాస్ అంతకుమించి అనేలా..
X

ప్రభాస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ గా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి సిద్దమవుతున్నారు. "బాహుబలి" చిత్రం తర్వాత ప్రభాస్ వేసిన ప్రతి అడుగు తెలుగు సినిమా ప్రతిష్టను పెంచడమే లక్ష్యంగా ఉంది. ఆయన విజయాలు, అపజయాలు పక్కన పెడితే, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "కల్కి 2898 ఎడి" ఇప్పుడు అంతకుమించి అనేలా ఇంపాక్ట్ చేసేలా కనిపిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ ప్రభాస్ అపీల్ కు తోడవడంతో, ఇది ఆయనను ఒక విశ్వవ్యాప్త స్థాయికి చేర్చడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా జస్ట్ ఓటిటి ప్రీల్యూడ్ బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సీరీస్ చూస్తే గ్లోబల్ లెవెల్లో మేకర్స్ ఎలా ప్లాన్ చేశారో తెలుస్తోంది.

ఇలాంటి యూనివర్సల్ అపీల్ కలిగిన సిరీస్‌లు, సినిమాలు మనం హాలీవుడ్ నుండి ఎక్కువగా చూస్తుంటాము. ఇప్పుడు అదే కోవలో "కల్కి 2898 ఎడి" కూడా ఉందని చెప్పవచ్చు. యానిమేషన్ సీరీస్ ఒక లెవెల్లో ఉంది.. ఇక కల్కి ఫుల్ సినిమా మరో స్థాయిలో ఉంటుందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ రేంజ్ రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని డెఫినేట్ గా చెప్పవచ్చు.

ఈ చిత్రం, ప్రభాస్ తన కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి, ప్రభాస్ ఈ సినిమాలో ఒక విశ్వవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకోవాలని యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో కల్కి 2898 ఎడి ప్రమోషన్స్ కూడా హై రేంజ్ లో ఉన్నాయి. సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్లకు పైనే అని తెలుస్తోంది.

వైజయంతి మూవీస్ 50 ఏళ్ళ సినీ అనుభవంలో ఇలాంటి సినిమా ఎప్పుడు నిర్మించలేదు. అలాగే ఇండియాలో కూడా ఇప్పటివరకు ఇంత భారీ బడ్జెట్ సినిమా రాలేదు. ఇక తప్పకుండా వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ 1000 కోట్లు దాటడం పక్కా అని తెలుస్తోంది.

ఇలాంటి గ్లోబల్ ప్రాజెక్ట్స్ వల్ల, ప్రభాస్ ఒక పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడానికి సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ ను ఒక కొత్త దశకు తీసుకెళ్లడం ఖాయం. ఇక ఈ సినిమా విడుదలయ్యాక, ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ మాత్రమే కాదు, మన తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఒక గౌరవప్రదమైన ఘట్టం అవుతుంది. “కల్కి 2898 ఎడి” మూవీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, ప్రభాస్ ను ఒక యూనివర్సల్ స్టార్ గా మార్చడానికి సిద్ధమవుతోంది.