Begin typing your search above and press return to search.

కల్కి.. మేకర్స్ ఏం చేయాలి మరి?

అయితే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నా.. ఉన్న ప్రమోషన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:52 AM GMT
కల్కి.. మేకర్స్ ఏం చేయాలి మరి?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి ప్రపంచాన్ని చూసేందుకు వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సినిమాపై కూడా వేరే లెవెల్ లో అంచనాలు పెట్టుకున్నారు.

అయితే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నా.. ఉన్న ప్రమోషన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నా.. ఎక్స్పెక్ట్ చేసిన హైప్ క్రియేట్ అవ్వలేదు. ఫస్ట్ సింగిల్.. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు. కానీ సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇకనైనా మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఇక నేడు ముంబైలో ప్రీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే మూవీ టీమ్ ముంబై చేరుకుంది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నా దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్‌ సహా టీమ్ అంతా పాల్గొంటారు. దీంతో ఈ ఈవెంట్ తో మేకర్స్ బీటౌన్ లో భారీ బజ్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఇదే సరైన అవకాశం అనే చెప్పాలి.

నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన కల్కి ఎపిసోడ్ -1 ప్రీ లూడ్ వీడియో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మరిన్ని ఎపిసోడ్స్ విడుదల అవ్వాల్సి ఉంది. వాటితో భారీ హైప్ క్రియేట్ చేయాలి మేకర్స్. ఆ తర్వాత రెండు సాంగ్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆ రెండూ ఆడియన్స్ ను అలరిస్తే భైరవ యాంథమ్ పై వచ్చిన మిక్స్ డ్ టాక్ పక్కకు పోతుంది. ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్.. మేకర్స్ కు ఒక పెద్ద ఆయుధం. విడుదలకు కొద్ది రోజుల ముందు రిలీజ్ చేసి అందరి దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకోవాలి.

అయితే రిలీజ్ ట్రైలర్ లో వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ తోపాటు పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉండేలా మేకర్స్ చూసుకోవాలి. ఈ సినిమా కాన్సెప్ట్ ను హిందూ పురాణాల నుంచి తీసుకోవడంతో.. రిలీజ్ ట్రైలర్ లో ఆ అంశాన్ని సాలిడ్ గా ప్రజెంట్ చేయాలి. అప్పుడు అనేక మంది ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అవుతుంది. అలా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ప్రేక్షకుల మౌత్ టాక్ పైనే సినిమా ఆధారపడి ఉంటుంది. మరేం జరుగుతుందో చూడాలి.